శ్రావణ మాసంలో మద్యం ఎందుకు సేవించకూడదో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్ ఇదే..
మన దేశంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలలో శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే చాలా మంది ఈ పవిత్ర మాసంలో ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. అంతేకాదు శ్రావణ మాసంలో మద్యం సేవించకూడదని పెద్దలు చెబుతారు. ఈ కాలంలో ఎందుకు మద్యం సేవించకూడదో ? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

శ్రావణ మాసంలో మద్యం సేవించకపోవడం అనే దాని వెనుక మత విశ్వాసం మాత్రమే కాకుండా ఆరోగ్యం, శాస్త్రీయ పరిగణనలపై కూడా ఆధారపడి ఉంటుంది. శ్రావణ మాసం మనస్సు, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకునే సమయం. మద్యం సేవించడం వల్ల మనస్సు అపవిత్రం చేసే అవకాశం ఉంది. మనస్సు అపవిత్రంగా మారితే దైవ నామాన్ని జపించడం, పూజించడంపై శ్రద్ధ ఉండదు. అందుకే ఈ సమయంలో మద్యం సేవించడం మానుకోవాలని పెద్దలు అంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన బాగా చేయవచ్చు.
శ్రావణ మాసం.. తనను తాను నియంత్రించుకోవడానికి, మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి చక్కని సమయం. మద్యం తాగడం వల్ల వ్యక్తి తనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. తద్వారా మనసు కోరుకున్నట్లుగా ప్రవర్తించే అవకాశం ఉండదు. కాబట్టి, శ్రావణ మాసంలో మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల భావోద్వేగాలను, అలవాట్లను నియంత్రించుకోవడంలో సహాయపడుతుంది. అంతేకాదు శ్రావణ మాసం దైవ చితనకు మాత్రమేకాదు, స్వీయ క్రమశిక్షణకు కూడా ముఖ్యమైనది.
శ్రావణ మాసంలో మద్యపానానికి దూరంగా ఉండటం వెనుక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలం కారణంగా శరీరం, జీర్ణవ్యవస్థ రెండూ బలహీనపడతాయి. వర్షాకాలంలో వాతావరణం కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. ఆల్కహాల్ జీర్ణం కావడం చాలా కష్టం. అందువల్ల దీనిని తాగడం వల్ల కడుపు సమస్యలు, ఆమ్లత్వం, అజీర్ణం ఏర్పడతాయి. ఈ కారణంగా శ్రావణ మాసంలో మద్యం సేవించకూడదు. వర్షాకాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మద్యం సేవిస్తే శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అందువల్ల త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే మద్యం.. కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులకు సులభంగా కారణమవుతుంది.
ఆల్కహాల్ వల్ల కాలేయం తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల కాలేయ వ్యాధులు వస్తాయి. మద్యం తాగడం వల్ల శరీరంలో నీటి స్థాయి తగ్గుతుంది. నీరు లేకపోవడం ఆరోగ్యానికి హానికరం. క్లుప్తంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో మద్యం సేవించకూడదనే సంప్రదాయం కేవలం మతవిశ్వాసంకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మన శరీరానికి, పర్యావరణానికి మంచి చేసే ఆరోగ్యకరమైన అలవాటు. ఈ సమయంలో మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల శరీరం, మనస్సు రెండూ స్వచ్ఛంగా ఉంటాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.




