AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: మీ లైఫ్ పార్టనర్‌లో ఈ మార్పులు కనిపిస్తే ఏదో తప్పు చేస్తున్నట్లే.. ఇలా గుర్తించండి!

మన లైఫ్‌ పార్టనర్‌ మనల్ని మోసం చేస్తుంటే.? తెలుసుకునేది ఎలా.? ఇదిగో మీ భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే..

Relationship Tips: మీ లైఫ్ పార్టనర్‌లో ఈ మార్పులు కనిపిస్తే ఏదో తప్పు చేస్తున్నట్లే.. ఇలా గుర్తించండి!
Signs To Show Your Spouse Having An Affair
Ravi Kiran
|

Updated on: Sep 26, 2022 | 12:59 PM

Share

మనల్ని ప్రేమించే వ్యక్తి.. మనకు తెలియకుండానే ఇతరులతో ఎఫైర్ పెట్టుకున్నట్లయితే..? ఆ ఫీలింగ్ గుండెకు చాలా బాధను మిగల్చడమే కాదు.. ఎంతో కష్టంగా కూడా ఉంటుంది. అస్సలు తట్టుకోలేం. మరి మన లైఫ్‌ పార్టనర్‌ మనల్ని మోసం చేస్తుంటే.? తెలుసుకునేది ఎలా.? ఇదిగో మీ భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే.. వెంటనే అలెర్ట్ అవ్వండి..!

  • మొబైల్ ఫోన్ దాచిపెట్టడం:

మీ పార్టనర్‌ ఎప్పుడైతే.. మీ నుంచి వారి ఫోన్ దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారో..? ఏదో తప్పు జరుగుతోందన్న మాట. ఎప్పటికప్పుడు కాల్ హిస్టరీ, మెసేజ్‌లు డిలీట్ చేయడం, ఫోన్ కనిపించకుండా దాచిపెడుతుంటే.. మీ భాగస్వామి ఏదో గూడుపుఠాణీ జరుపుతున్నట్లే. అప్పుడు మీరు వెంటనే అలెర్ట్ అవ్వాలి. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి.

  • మీ ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయకపోతే..

మీ దగ్గర నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను మీ పార్టనర్ ఆన్సర్ చేయకపోయినా.. ‘పనిలో ఉన్నా’ నీతో తర్వాత మాట్లాడతా.. అంటూ పొడిపొడి సమాధానాలు చెబుతున్నారా.? మీ లైఫ్ పార్టనర్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ మార్పు సడన్‌గా వచ్చిందా.? అయితే మిమ్మల్ని ఎవాయిడ్ చేస్తున్నారన్న మాటే. ఏదో తప్పు జరుగుతోందని గ్రహించాలి.

  • అతిగా ప్రవర్తించడం..

తప్పు చేయనివాడు ఎప్పుడూ భయపడడు. కాని తప్పు చేసేవాడు ప్రతీ చిన్న విషయానికి భయపడతాడు. మీరు అడిగిన ప్రశ్నలకు మీ భాగస్వామి కంగారుపడుతూ జవాబిస్తే.. ఏదో దాస్తున్నాడన్నట్లు లెక్క.

  • సెక్స్ లైఫ్‌లో మార్పులు..

ఎప్పుడూ ప్రేమగా చూసుకునేవాడు.. మిమ్మల్ని ఎలప్పుడూ దగ్గరగా ఉంచుకునేవాడు. సడన్‌గా దూరం పెడుతుంటే..? ఈ మార్పు మీ భాగస్వామిలో కనిపిస్తే అతడు ఏదో మీ నుంచి సీక్రెట్ దాస్తున్నట్లే.

  • తరచూ అబద్దాలు..

మీ భాగస్వామి సీక్రెట్‌గా ఎఫైర్ సాగిస్తున్నట్లయితే.. ప్రతీ విషయంలోనూ మీ పార్టనర్ నోటి నుంచి అబద్దం మాత్రమే వస్తుంది. అంశం ఏదైనా కూడా దాన్ని దాటవేయడానికి చూస్తుంటాడు.

  • సడన్ సర్‌ప్రైజ్‌లు..

ఎప్పుడూ లేనట్టుగా మీ పార్టనర్ మీకు సడన్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారా? కచ్చితంగా అనుమానపడాల్సిందే. మీ జీవనశైలికి విరుద్దంగా ఆ గిఫ్ట్స్ ఉంటే.. అది వేరొకరికి తీసుకున్నవి అని అర్ధం.

  • సామాజిక మాధ్యమాల్లో వేర్వేరు ఖాతాలు..

సోషల్ మీడియాలో మీ జీవిత భాగస్వామి ఎంత యాక్టివ్‌గా ఉంటాడు.? మీ ఫోటోలను ట్యాగ్ చేయడం, లేదా కామెంట్ చేయడం జరుగుతుందా.? కొందరు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. అలాంటివారు ఏదైనా అఫైర్ పెట్టుకున్నట్లయితే.. వారి యాక్టివిటీస్‌లో మార్పును గమనించవచ్చు. అలాగే ఇంకొందరు తమ పార్ట్‌‌నర్స్‌కు తెలియకుండా దాచేందుకు నిక్ నేమ్స్‌తో సీక్రెట్‌గా అకౌంట్స్ మొదలుపెడతారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం..