
కాకరకాయ రుచికి చేదుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే చాలా మంది కాకర కాయ తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇతర కూరగాయ మాదిరి కాకరకాయ వంటకాలు ఎంత రుచికరంగా తయారు చేసినప్పటికీ అందులో ఉండే సహజ చేదు కారణంగా దానిని తినడానికి వెనుకాడుతుంటారు. నిజానికి దీని ఆరోగ్య ప్రయోజనాలు సాటిలేనివని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కాకరకాయను కొన్ని రకమైన ఆరోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కాకరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపు నొప్పి, విరేచనాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
కాకరకాయ జ్వరాన్ని తగ్గించడానికి గొప్ప ఔషధంగా పని చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి వేరే మందులు అవసరం లేదు. కేవలం కాకరకాయ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.
కాకరకాయ కడుపు, ప్రేగుల వాపు వంటి గ్యాస్ట్రిటిస్ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
కాకరకాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
చేదు రుచి కలిగిన కాకరలో కరిగే ఫైబర్, ఇతర సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
కాకరకాయలో విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
కాకరకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
కాకరకాయలోని విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
కాకరకాయ కాలేయాన్ని శుభ్రపరచడానికి, విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.
కాకరకాయ రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
కాకరకాయను తాజాగా తినవచ్చు. లేదంటే జ్యూస్ మాదిరి చేసి, వడకట్టి తాగవచ్చు. కాకరకాయను నీటిలో మరిగించడం ద్వారా లేదా ఎండబెట్టడం ద్వారా కూడా ఉపయోగించవచ్చు. కాకరకాయను ఉడికించడం, వేయించడం, సూప్‌లో ఉపయోగించడం ద్వారా కూడా తినవచ్చు. కాకరకాయతో కమ్మని ఊరగాయలు తయారు చేసుకుని కూడా ఆరగించవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.