Personality Test: ఈ చిత్రంలో మొదట ఏ పక్షిని ఎంచుకుంటారో.. అదే మీ వ్యక్తిత్వం..
మనిషి ప్రవర్తించే తీరుకి అద్దం పట్టేది వ్యక్తిత్వం. కొంతమంది వ్యక్తులు తమ విభిన్నమైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాల కారణంగా నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు. అయితే మనిషి వ్యక్తిత్వాన్ని అరచేతి, కళ్ళు, ముక్కు, చెవుల ఆకారం ద్వారా మాత్రమే కాదు నడవడిక, భంగిమ, వంటి ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అదే విధంగా అభిరుచుల బట్టి కూడా మనిషి వ్యక్తిత్వం తెలుస్తుందట. ఈ చిత్రంలో మీరు ఎంచుకున్న పక్షిని బట్టి మీలో దాగున్న వ్యక్తిత్వం బయటపడవచ్చు.

ప్రతి వ్యక్తి ఒకేలా కనిపించడు. అదేవిధంగా మనిషి మనిషికి వ్యక్తిత్వ లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే వ్యక్తి … వ్యక్తిత్వాన్ని వారి కళ్ళు, అరచేతులు, పిడికిలి, మాట్లాడటం, నడవడం , కూర్చున్న భంగిమ ద్వారా తెలుసుకోవచ్చు. అంతే కాదు అభిరుచి ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చట. ఈ చిత్రంలో మీరు ఏ పక్షిని ఎంచుకుంటారనే దాని ఆధారంగా మీ వ్యక్తిత్వం బయటపడుతుంది. మరి ఈ చిత్రంలో మీరు ముందుగా ఏ పక్షిని ఎంచుకుంటారు? దీని ద్వారా మీ ప్రవర్తన అభిరుచి వంటి వాటిని గురించి తెలుసుకుందాం..
మీరు మొదటి పక్షిని ఎంచుకుంటే.. మీరు ప్రతి క్షణాన్ని మీరు కోరుకున్న విధంగా ఆస్వాదించే వ్యక్తి అవుతారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించరు. ఈ క్షణం గురించి ఆలోచిస్తారు. తమకు దక్కిన దానిని పంచామృతం అన్నట్లుగా జీవిస్తారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిత్వం వీరి సొంతం.
మీరు రెండవ పక్షిని ఎంచుకుంటే.. ఈ వ్యక్తులు మంచి శ్రోతలు. అంతేకాదు వీరు నమ్మదగిన , దయగల వ్యక్తి. అందువల్ల ప్రతి ఒక్కరూ వీరిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. విశ్వసిస్తారు. వీరు అనవసరమైన విషయాలలో కలిగించుకుని ఎక్కువగా ఇబ్బంది పడరు. వీరు ఆలోచనాత్మక వ్యక్తులు. కనుక ఎక్కువ మంది వీరి నుంచి సలహా తీసుకుంటారు.
మూడవ పక్షిని ఎంచుకునే వ్యక్తులు భావోద్వేగ జీవులు. వీరికి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు వీరి శక్తి సామర్ధ్యాలను, స్థాయిలను తగ్గిస్తాయి. అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా కష్టపడి మంచి పని చేసే గుణం కలిగి ఉంటారు.
నాల్గవ పక్షిని ఎంచుకునే వ్యక్తుల భావోద్వేగాలు స్థిరంగా ఉండవు. భావాలు కాలక్రమేణా మారుతాయి. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరి మొదటి బలం. వీరికే ప్రాధాన్యత. అయితే చిన్న చిన్న తప్పులు కూడా వీరిలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి.
మీరు ఐదవ పక్షిని ఎంచుకుంటే.. మీరు స్నేహపూర్వకంగా ఉంటారు. స్నేహితులు , కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రియమైన వ్యక్తుల మద్దతు పొందుతారు. కనుక వీరు ఈ విషయంలో అదృష్టవంతులు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..