Chapati: ఈ సమస్యలున్న వారు చపాతీ తిన్నారో.. నేరుగా యమలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లే
ఆరోగ్యానికి మంచిది కదాని చాలా మంది చపాతీ తినేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇది అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చపాతీ అస్సలు తినకూడదు. పొరబాటున తింటే మాత్రం చిక్కుల్లో పడిపోతారు..

చపాతీ అంటే వెంటనే మన గుర్తుకు వచ్చేది వెయిట్‌లాస్ బెస్ట్ డైట్ ఫుడ్. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రజల ప్రధాన ఆహారం చపాతీ. చపాతీ లేకుండా వారికి రోజు గదవదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు చపాతీలను ఎక్కువగా తీసుకుంటుంటారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యానికి సొంతం చేసుకోవచ్చని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం చపాతీ తినడం మానుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
మధుమేహ వ్యాధిగ్రస్తులు
ఇటీవలి కాలంలో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతుంది. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నానికి బదులు గోధుమ చపాతీ ఎక్కువగా తింటుంటారు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు చపాతీ తినకూడదు. ఇందులో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు చపాతీని తక్కువగా తీసుకోకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలసటతో బాధపడేవారు
ఎప్పుడు అలసిపోయినట్లు అనిపించేవారు చపాతీ తినకపోవడమే మంచిది. ఎందుకంటే గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం మరింత పెరుగుతాయి. ఇది శక్తిని తగ్గించి ఆకలిని పెంచుతుంది. కాబట్టి, అలసటగా ఉంటే చపాతీ తినకపోవడమే మంచిది.
థైరాయిడ్ సమస్య
మీకు ఏదైనా థైరాయిడ్ సమస్య ఉంటే చపాతీ తినకూడదు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని వల్ల థైరాయిడ్ సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది.
అధిక బరువు
చాలామంది అన్నం మానేసి చపాతీ తింటారు. అయితే చపాతీలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారనిపిస్తుంది. గోధుమల్లో ఉండే గ్లూటెన్‌లోని కార్బోహైడ్రేట్లు శరీరంలో కొవ్వును నిల్వ చేయడానికి కారణమవుతాయి. ఇది చాలా సులభంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు చపాతీకి దూరంగా ఉండటం మంచిది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు
చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే, గోధుమలలోని గ్లూటెన్ పేగులలో మంటను కలిగిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది.