AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జొన్నలు, రాగులు సరే.. సజ్జలు తింటే ఏమౌతుందో తెలుసా..?

చిరుధాన్యాలలో సజ్జలు ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు తినడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి, మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.సజ్జలను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి, గుండె పనితీరు మెరుగుపడతాయి. ఇందులోని అమీనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఉపకరిస్తాయి.

జొన్నలు, రాగులు సరే.. సజ్జలు తింటే ఏమౌతుందో తెలుసా..?
Sajjalu
Jyothi Gadda
|

Updated on: Nov 13, 2025 | 2:43 PM

Share

ప్రస్తుతం మిల్లెట్స్ ఆహారం పైన చాలామందిలో అవగాహన పెరిగింది. ప్రతిరోజు మిల్లెట్స్ తినడం వల్ల అనేక రోగాలు తగ్గుతాయని గుర్తించారు. ఇక అటువంటి చిరుధాన్యాలలో సజ్జలు ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు తినడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి, మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.సజ్జలను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి, గుండె పనితీరు మెరుగుపడతాయి. ఇందులోని అమీనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఉపకరిస్తాయి.

సజ్జలు తినడం వల్ల డయాబెటిస్ కూడా రాకుండా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడేవారు సజ్జలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి షుగర్‌ కంట్రోల్ అయ్యేలా చేస్తాయి. వేరే ఆహారాలతో పోలిస్తే సజ్జలు కాస్త నిదానంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఇవి రక్తంలోకి గ్లూకోజ్ ను మెల్లగా విడుదల చేస్తాయి. మధుమేహం బాధితులకు మంచి ఆహారం. మధుమేహంతో బాధపడేవారు రోజూ సజ్జ అన్నం లేదా రొట్టెలు తినడం వల్ల గోధుమ రొట్టెల కన్నా ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

సజ్జల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతగానో దోహదం చేసి శరీరం మెటబాలిజం బాగా జరిగేలా చేస్తాయి. సజ్జలను తింటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారికి సజ్జలు మంచి ఆహారం. సజ్జల్లో ఫినాలిక్ లు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యలలో యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పని చేస్తాయి.

ఇవి కూడా చదవండి

సజ్జలను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చర్మం మీద ముఖం మీద ముడతలు తొలగిపోయి ఆరోగ్యంగా కనిపిస్తారు. ఇక సజ్జలలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో రక్తహీనతను తగ్గిస్తాయి. సజ్జలు మన జీవక్రియను మెరుగుపరుస్తాయి.

కొలెస్ట్రాల్ ను నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి అద్భుతమైన శక్తి వనరుగా పనిచేస్తాయి. బరువును తగ్గించటంలో కీలకంగా పనిచేస్తాయి. మొత్తంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సజ్జలను మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. మరింకెందుకు ఆలస్యం… సజ్జలను ఆహారంలో తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..