Optical Illusion: హర్ష్ గోయెంకా సవాల్..! వందల ముఖాల మధ్య దాగి ఉన్న పిల్లిని 3 నిమిషాల్లో గుర్తించగలరా?
కళ్ళు, మెదడును సవాలు చేసే ఆసక్తికరమైన ఆప్టికల్ భ్రాంతి చిత్రాలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని పరిష్కరించడానికి అందరూ ఇష్టపడతారు. అయితే అలాంటి పజిల్ గేమ్‌లను పరిష్కరించడానికి తెలివితేటలు అవసరం. ఇప్పుడు ఇలాంటి సవాలుతో కూడిన చిత్రం వైరల్‌గా మారింది. దీనిలో మీరు వందలాది ముఖాల మధ్య దాగి ఉన్న పిల్లిని కనుగొనాలి. మీరు ఈ పజిల్‌ను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారా?

పజిల్ చిత్రాలు.. ఆప్టికల్ భ్రాంతుల మాదిరిగానే, భ్రమలను సృష్టిస్తాయి. అందువల్ల అందరూ ఈ పజిల్‌ను పరిష్కరించలేరు. అందువల్ల చాలా మంది ఇలాంటి ఆటలలో ఓడిపోతారు. అయితే ఈ చిత్రాలు వారికి చూపులో ఎంత పదును ఉంది? ఎంత ఆలోచనా సామర్థ్యం ఉందో చూపిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చిత్రాన్ని చూడటం సులభం. వందలాది విభిన్న ముఖాల మధ్య దాగి ఉన్న పిల్లిని కనుగొనడం ఒక సవాలు. అయితే ఈ పజిల్‌ను పరిష్కరించడానికి సమయం కేవలం మూడు నిమిషాలు మాత్రమే. మీరు ఈ పజిల్‌ను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటే.. మీ సమయం ప్రారంభమవుతుంది.
వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన కొత్త సవాలు ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. RPG గ్రూప్ చైర్మన్ X లో ఒక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని పంచుకున్నారు. మీరు 3 నిమిషాల్లో పిల్లిని కనుగొనగలరో లేదో చూద్దాం…” అనే కాప్షన్ ఇచ్చారు.
ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.
Let’s see if you can find the cat within 3 minutes….. pic.twitter.com/mJp01GRXLD
— Harsh Goenka (@hvgoenka) September 7, 2025
ఈ చిత్రంలో ఏముంది?
పజిల్ గేమ్స్ వినోదాన్ని అందించడమే కాదు మన ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను కూడా పెంచుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో వందలాది ముఖాలను చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రతి ముఖం విభిన్నమైన లక్షణాలు, కేశాలంకరణలను కలిగి ఉంది. ఈ మానవ ముఖాల మధ్య ఒక పిల్లి దాగి ఉంది. డేగ కళ్ళు ఉన్నవారు మాత్రమే ఈ పజిల్‌ను పరిష్కరించగలరు. కనుక ఇచ్చిన సమయంలో సమాధానం కనుగొనడానికి ప్రయత్నించండి.
వినియోగదారు వ్యాఖ్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సెప్టెంబర్ 7న షేర్ చేయబడిన ఈ పోస్ట్ 2 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. ఒక వినియోగదారుడు, “నేను ఐదు నిమిషాలు చిత్రాన్ని చూస్తూనే ఉన్నా.. పిల్లిని కనుగొనలేకపోయాను. ఇది చాలా కష్టం” అని అన్నారు. మరొక వినియోగదారుడు, “చివరకు నేను పిల్లిని కనుగొన్నాను.. అని ఒకరు.. ఇప్పుడు నా దృష్టిని సారించినా.. తగిన సమాధానం దొరకకపోవడంతో నేను ఆశ వదులుకున్నాను. అయితే అకస్మాత్తుగా పిల్లి నా ముందు కనిపించింది” అని వ్యాఖ్యానించారు.
మీరు పిల్లిని చూశారా?

మీరు ఎప్పుడైనా చిత్రంలో దాగి ఉన్న పిల్లిని ఎంత వెతికినా కనుగొనలేకపోయారని చాలా నిరాశ చెందారా? దాగి ఉన్న పిల్లిని మీరు గుర్తించగలిగితే, మీకు ఖచ్చితంగా డేగ కన్ను ఉన్నట్లే. మీరు పిల్లిని గుర్తించకపోతే, మేము మీకు సమాధానం చెబుతాము. ఈ చిత్రంలో, వందలాది ముఖాల మధ్య దాగి ఉన్న పిల్లిని పసుపు రంగుతో గుర్తించాము.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








