AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంకల్పం ఉంటే వర్షం ఏమి చేస్తుంది? వానలో హనుమాన్ చాలీసాకి భరత నాట్యం చేసిన యువతులు..

సంకల్పం మంచిది అయితే ఏదైనా సాధ్యమే అని పెద్దలు చెబుతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలను చూసినప్పుడు ఈ మాట నిజమే అనిపిస్తుంది. అలాంటి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అవును కళాశాల విద్యార్థులు వర్షంలో కూడా భరతనాట్యం అద్భుతంగా ప్రదర్శించారు. తమ నృత్యంతో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంకల్పం ఉంటే వర్షం ఏమి చేస్తుంది? వానలో హనుమాన్ చాలీసాకి భరత నాట్యం చేసిన యువతులు..
Karnataka Students' Bharatnatyam In Rain
Surya Kala
|

Updated on: Sep 10, 2025 | 8:27 AM

Share

ప్రస్తుత తరం తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముందు ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో కాలేజీ రోజుల్లో మాత్రమే కాదు ఫంక్షన్, సమయం, సందర్భం వచ్చినా సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. అయితే శాస్త్రీయ నృత్యాలపై తక్కువ మంది మాత్రమే శ్రద్ధ చూపుతారు. అయితే ఈ వైరల్ వీడియోలో నిట్టే మహాలింగ అద్యంతయ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు వర్షంలో కూడా హనుమాన్ చాలీసాకు భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు .

వర్షం మధ్య మహిళా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన.

ఇవి కూడా చదవండి

rednewsindia అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం ఒక కారిడార్‌లో భరతనాట్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. వారు వర్షం మధ్య హనుమాన్ చాలీసాకు అద్భుతమైన భరతనాట్యం ప్రదర్శన చేశారు. వీరు చేస్తున్న డ్యాన్స్ ని ప్రేక్షకులు తమ మొబైల్ కెమెరాలలో బంధించారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.

ఈ వీడియోను ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా వీక్షించారు, వినియోగదారులు దీనిని కర్ణాటక సంస్కృతికి జన్మస్థలం అని పిలుస్తారు. కళ, భక్తి కలిసినప్పుడు వర్షం కూడా లయను ఆపలేవని మరొకరు అన్నారు. నేను ఈ డ్యాన్స్ ప్రదర్శనను చూసిన ప్రతి క్షణం నన్ను ఉత్సాహపరుస్తుందని ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..