AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహారం వల్ల మాత్రమే ఊబకాయం వస్తుందా..? జన్యుశాస్త్రం, హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుందా..

భారతదేశంలో.. 2050 నాటికి అధిక బరువు ఉన్నవారి సంఖ్య 45 కోట్లకు పెరగే అవకాశం ఉందని వైద్య పత్రిక ది లాన్సెట్ నివేదికలో పేర్కొంది.. ఊబకాయం 25 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది.. ఇంకా చిన్నారుల్లో కూడా ఊబకాయం కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.. అయితే.. ఊబకాయం పెరగడానికి ఆహారం ఒక కారణమని భావిస్తారు.. కానీ అది ఒక్కటే కారణమా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

ఆహారం వల్ల మాత్రమే ఊబకాయం వస్తుందా..? జన్యుశాస్త్రం, హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుందా..
Weight Loss Tips
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2025 | 6:49 PM

Share

ప్రస్తుత కాలంలో ఊబకాయం పెను సమస్యగా మారుతోంది.. అన్ని ప్రమాదకర జబ్బులకు కారణం స్థూలకాయమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వైద్య పత్రిక ది లాన్సెట్ సంచలన నివేదికను ప్రచురించింది. 2050 నాటికి భారతదేశంలో 25 ఏళ్లు పైబడిన అధిక బరువు ఉన్నవారి సంఖ్య 45 కోట్లకు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 2050 నాటికి 62 కోట్లకు పైగా ప్రజలు ఊబకాయంతో బాధపడే అవకాశం ఉన్న ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి అని నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఊబకాయం సమస్య గణనీయంగా పెరుగుతోందని లాన్సెట్ డేటా చూపిస్తుంది. ఇప్పుడు పిల్లలు కూడా దాని బాధితులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.

సాధారణంగా ఊబకాయానికి కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి అని చెబుతారు.. కానీ ఇది ఒక్కటే కారణం కాదు. జన్యుశాస్త్రం, హార్మోన్లు కూడా ఊబకాయానికి కారణమని నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఊబకాయానికి జన్యు సిద్ధత (Genetic predisposition) ఉండవచ్చు.. ఈ సమస్య తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీని కారణంగా, వారి శరీర శక్తి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆకలి పెరిగి ఊబకాయం పెరుగుతుంది.

ఊబకాయాన్ని పెంచడంలో జన్యుశాస్త్రం – హార్మోన్ల పాత్ర ఏమిటి?

మీ కుటుంబంలో ఊబకాయం చరిత్ర ఉంటే.. మీకు ఊబకాయం (స్థూలకాయం) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సమీర్ భాటి వివరిస్తున్నారు. ఇదంతా జన్యుశాస్త్రం వల్ల జరుగుతుంది. చాలా సందర్భాలలో, హార్మోన్ల వల్ల కూడా ఊబకాయం వస్తుంది. శరీరంలో లెప్టిన్ అనే హార్మోన్ ఉందని.. అది మీరు ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో మీ శరీరానికి తెలియజేస్తుందని డాక్టర్ భాటి వివరించారు. లెప్టిన్ పనితీరులో ఏదైనా తప్పు జరిగితే, అది తినడంపై నియంత్రణ కోల్పోవడానికి దారితీస్తుంది. ఫలితంగా ఊబకాయం పెరుగుతుంది.

అదేవిధంగా, గ్రెలిన్ అనేది మీరు ఎప్పుడు తినాలో మీ శరీరానికి చెప్పే హార్మోన్. ఒక వ్యక్తి శరీరంలో గ్రెలిన్ పరిమాణం ఎక్కువగా ఉంటే, మీకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ది నేచర్ అనే మెడికల్ జర్నల్‌లో జరిపిన పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 20 శాతం మందిలో ఊబకాయానికి కారణం జన్యుపరమైన, హార్మోన్లపరమైన కారణాలేనని డాక్టర్ భాటి వివరించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని తెలిపారు.

ఊబకాయం పెరగడానికి ఇవి కూడా కారణాలు

శారీరక శ్రమ లేకపోవడం

మానసిక ఒత్తిడి

నిద్ర లేకపోవడం

కొన్ని రకాల మందులు

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!