AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ వ్యాధికి చెక్.. వేసవిలో ఈ పండు తినడం వలన ఎన్ని లాభాలో..

వేసవిలో ఎక్కువగా దొరికే పండ్లలో పుచ్చకాయలు ఒకటి. చాలా మంది వీటిని సమ్మర్‌లో చాలా ఇష్టంగా తింటారు. ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, మన ఆరోగ్యానికి దివ్యఔషధంగా కూడా పని చేస్తుందంట. అయితే కొంత మంది పుచ్చాకాయ తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ సమ్మర్‌లో తప్పనిసరిగా ఈ పండు తినాలంటున్నారు నిపుణులు. కాగా, సమ్మర్‌లో ఈ పుచ్చకాయను తినడం లన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 04, 2025 | 5:10 PM

Share
పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో వాపు వస్తుంది. దీనివల్ల కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. మద్యం సేవించే వ్యక్తులు దీని కారణంగా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు డయాబెటిస్ సమస్య ఉన్నవారు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తినాలి. ఎందుకంటే ఇందులోని సహజ చక్కెర మీ బ్లడ్‌షుగర్‌ని పెంచుతుంది.

1 / 5
అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలోని తెలుపు, ఇతర భాగాలు పెద్దలలో అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిన విషయమే.

2 / 5
మీరు మొత్తం పుచ్చకాయ తినలేకపోతే, దాని రసం తీసి తాగడం మంచిది. మీరు పుచ్చకాయ ముక్కలను వడకట్టి నిల్వ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు తినడం వల్ల దాని పోషకాలు తగ్గుతాయి. అందుకే తాజా పుచ్చకాయ తినడం మంచి ఎంపిక. ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినడం వల్ల పోషకాలు తగ్గిపోయి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే పుచ్చకాయ కోసిన వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది.

3 / 5
పుచ్చకాయలో సహజ శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. అందుకే వేసవిలో దీనిని తరచుగా తింటారు. కానీ ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ ఇంకా చల్లగా ఉంటుంది. కొంతమందికి దీన్ని తిన్న వెంటనే దగ్గు, జలుబు, గొంతు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట చల్లటి పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మందగించడమే కాకుండా, అజీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అలాగే, ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఉదయం లేదా మధ్యాహ్నం పుచ్చకాయ తినడం మంచిది.

4 / 5
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి కంటెంట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వల్ల మంచి ప్రకాశవంతమైన, అందమైన రంగుని ఇస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పుచ్చకాయని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

5 / 5