AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీ సమస్యలు జన్మలో రాకూడదంటే.. మీరు వారానికోసారైనా ఈ వెజిటబుల్ తినండి!

కీర దోస సలాడ్, జ్యూస్.. ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో..

కిడ్నీ సమస్యలు జన్మలో రాకూడదంటే.. మీరు వారానికోసారైనా ఈ వెజిటబుల్ తినండి!
Benefits Of Cucumber
Srilakshmi C
|

Updated on: Sep 04, 2025 | 9:59 PM

Share

ఆరోగ్యకరమైన ఆహారాల్లో కీర ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అందుకే వైద్యులు కూడా దీన్ని క్రమం తప్పకుండా తినమని చెబుతారు. దీనిని సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహానికి బెస్ట్‌ ఫుడ్

డయాబెటిస్ ఉన్నవారు తరచుగా మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. వీరు తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరంలో నిర్జలీకరణం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి కీర దోస క్రమం తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరం నుండి విషాన్ని తొలగించడానికి

క్రమం తప్పకుండా కీర దోస తినే అలవాటు ఉన్నమారి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం ఆహారం ముందు దానిని తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దోసకాయలో 95% నీరు ఉంటుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మలబద్ధకం నుంచి ఉపశమనం

కీర దోసలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ ప్రక్రియకు సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. రాత్రిపూట దోసకాయలు తినకపోవడానికి ప్రధాన కారణం దానిలోని శ్లేష్మం. మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత శారీరక శ్రమ తగ్గుతుంది కాబట్టి, వీలైనంత వరకు మధ్యాహ్నం ముందు వాటిని తీసుకోవడం మంచిది. అంతేకాకుండా, రాత్రిపూట వీటిని తీసుకుంటే వాటిలోని ఫైబర్ కంటెంట్ జీర్ణం కావడం కష్టమవుతుంది. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి.

మూత్రపిండాల ఆరోగ్యం

ఎక్కువగా నీరు తాగడం కుదరకపోతే కీర దోస తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది చర్మ అలెర్జీలు, వడదెబ్బల నుండి ఉపశమనం అందిస్తుంది. ఈ సమస్యలు తలెత్తినప్పుడు కీర దోస తినడం చాలా మంచిది. అంతే కాదు ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీర దోస తినడం వల్ల శరీరం నుండి విష పదార్థాలు తొలగిపోయి శరీర వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. కీర దోస రసం తాగడం వల్ల మూత్రపిండాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..