AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couple: పొరపాటున కూడా శృంగారం చేయకూడని 4 సమయాలు

మన శాస్త్రాలలో అన్ని అంశాల గురించి సుధీర్ఘంగా, విఫులంగా చెప్పబడి ఉంది. కానీ వాటిని ఈ కాలంలోని మనుషుకులకు చేరవేసే వారు తక్కువయ్యారు. ముఖ్యంగా శృంగారం ఏ సమయంలో చేయాలి.. ఏ సమయంలో చేయకూడదు వంటి వివరాలు.. ఎవ్వరికీ తెలియవు..

Couple: పొరపాటున కూడా శృంగారం చేయకూడని 4 సమయాలు
Couple
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2024 | 6:24 PM

Share

ప్రస్తుతం యువతకు ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా శృంగారం గురించి చాలా డౌట్స్ ఉంటాయి. వాటిని ఎవర్ని అడగాలో తెలియదు. ధైర్యం చేసి అడుగుదామనుకున్నా ఏమనుకుంటారో అన్న భయం. మన శాస్త్రాలలో శృంగారం గురించి ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పేవారు కరువయ్యారు. ఇప్పుడు భార్య భర్తలు శృంగారం చేయకూడని సమయాల గురించి తెలుసుకుందాం..

  1. ఉయదాన్నే లేచిన సమయం దైవారాధన కోసం. ఆ సమయంలో దంపతులు శృంగారంలో పాల్గొనకూడదు
  2. సాయంత్రం సూర్యస్తమయం సమయంలో శృంగారం చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రమద గణాలతో తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో శృంగారం చేస్తేనే హిరణ్యకశిపుడు లాంటి వాడు పుట్టాడని పురాణంలో ఉంది
  3. అలానే పూజలు, వ్రతాలు.. శ్రాద్ధ కర్మలు చేసినరోజు రాత్రి.. ఆ ముందు రోజు రాత్రి భార్యభర్తలు శృంగారం చేయకూడదు
  4. స్త్రీ రజస్వల సమయంలో శాస్త్ర ప్రకారం అసలు శృంగారం చేయకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు అని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త నండూరి శ్రీనివాస్ తెలియజేశారు

అలానే శృంగారం చాలామంది చీకట్లోనే చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఇది చాలా తప్పు అట. పూర్తి చీకటిగా ఉన్న గదిలో శృంగారం చేయకూడదట. ఆ గదిలో చిన్న దీపం అయినా ఉండాలట. లేకపోతే కొంచెం వెలుగు వచ్చే బల్బ్ అయినా ఉండాలి. చీకట్లో శృంగారం చేస్తే దరిద్రం వాళ్లకే కాకుండా సంతానానికి కూడా పాకుతుందట.