మహబూబాబాద్ జిల్లా సంతులాపాడు గ్రామంలో విచిత్రమైన దొంగతనం జరిగింది. గోలి వెంకటేశ్వర్లు ఇంట్లో రెండున్నర తులాల బంగారు నెక్లెస్ చోరీకి గురైంది. పోలీసుల విచారణతో భయపడిన దొంగ, తిరిగి ఆ బంగారాన్ని యజమాని ఇంటి ముందే వదిలివెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా ఆశ్చర్యం కలిగించగా, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.