Yellow Mirchis Unprecedented Prices: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఎల్లో మిర్చి ధర క్వింటాలుకు ₹44,000 పలికింది. బంగారంతో పోటీ పడుతున్న ఈ మిర్చి అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ కలిగి ఉంది. మిర్చీని ఎగుమతి చేయడం, ఆహార రంగులు, ఔషధాలు, సౌందర్య సాధనాల్లో దీనిని ఉపయోగించడం వల్ల ఈ పంట రైతులకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.