పిల్లలకు ఇష్టమని చికెన్, మటన్ లివర్ పెడుతున్నారా..? వామ్మో..

Prasanna Yadla

22 January 2026

Pic credit - Pixabay

ఆదివారం వస్తే చాలు చాలా మందికి చికెన్, మటన్ లేనిదే ముద్ద దిగదు. ఇంకొందరైతే వారం రోజుల్లో ఏడు రోజులు నాన్ వెజ్ తింటారు.

నాన్ వెజ్ 

అయితే, పెద్ద వాళ్ళు తినడమే కాకుండా చిన్న పిల్లలకు కూడా పెడతారు. వాటిలో చికెన్, మటన్ లివర్ ను ఎక్కువగా పెడతారు. 

చికెన్ లివర్

అసలు, పిల్లలకు చికెన్, మటన్ లివర్ పెట్టొచ్చా.. వైద్య నిపుణులు పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలు చెప్పారు. 

 పిల్లలకు మంచిదేనా? 

ఈ లివర్లలో కాడ్మియం, లెడ్ వంటి లోహాలు ఉంటాయి. ఇవి పిల్లల నరాల వ్యవస్థ పైన ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. 

పిల్లల నరాల వ్యవస్థ

అంతే కాదు, వీటిని అదే పనిగా పిల్లలకు పెడితే మెదడు పైన కూడా ప్రభావాన్ని పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మెదడు

పిల్లల్లో కొందరికి చికెన్, మటన్ లివర్ అంటే అలర్జీ ఉంటుంది. దీన్ని తెలుసుకోకుండా వారికీ పెడుతూనే ఉంటారు.

అలర్జీ

వీటిని అతిగా మీరు మీ పిల్లలకు పెడితే  దురద, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది

కడుపు ఉబ్బరం

కోళ్లకు, మేకలకు హార్మోనల్ ఇంజక్షన్లు ఇస్తారు. ఇవి నేరుగా వాటి లివర్ల పై ప్రభావం చూపుతుంది. 

పిల్లల పై ప్రభావం

 అంతే కాదు ఈ లివర్లో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి. వీటిని చిన్నప్పటి నుంచే తినిపిస్తే పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

పిల్లల ఆరోగ్యం