AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌పై హైకోర్ట్ 90 రోజుల టైమ్ బాంబ్..

టాలీవుడ్‌పై హైకోర్ట్ 90 రోజుల టైమ్ బాంబ్..

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 22, 2026 | 4:15 PM

Share

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన కొత్త తీర్పు సినీ పరిశ్రమకు పెద్ద సమస్యగా మారింది. ఇకపై విడుదలకు 90 రోజుల ముందే పిటిషన్ దాఖలు చేయాలన్న నిబంధన వాస్తవ పరిస్థితుల్లో అసాధ్యమని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇది వేసవి సినిమాలతో పాటు రాబోయే భారీ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ వివాదంపై ప్రభుత్వం నుండి లేదా ఉన్నత న్యాయస్థానం నుండి స్పష్టత కోసం చిత్ర వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

తెలంగాణలో టికెట్ రేట్ల మీద చర్చ రియల్ సినిమాలను మించిపోతుంది.. హార్రర్ సినిమాల్లో ఉండే ట్విస్టులు, టర్నుల కంటే ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. ఒక్కోరోజు ఒక్కో ట్విస్టు.. ఇటు సర్కార్ వైపు నుంచి.. అటు కోర్టు వైపు నుంచి.. రెండు వైపులా ఇండస్ట్రీపై నాన్ స్టాప్ పిడుగులు పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రేట్లపై మరో టైమ్ బాంబు పేల్చింది కోర్ట్. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే విడుదలకు 90 రోజులు ముందు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందే అని హై కోర్ట్ తీర్మానించింది. రీసెంట్‌గా అఖండ 2, రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ లాంటి పెద్ద సినిమాల రేట్ల విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు సీరియస్ అయింది.. అందుకే ఇలాంటి తీర్పు బయటికొచ్చింది. 90 రోజుల ముందే పిటిషిన్ వేసుకోవడం అనేది అసలు సాధ్యమేనా..? కోర్ట్ తీర్పు సంగతి కాసేపు అలా ఉంచితే.. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. అవి అప్పుడున్న OTT ఖాళీలు.. థియేటర్స్ సర్దుబాటును బట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటిదిప్పుడు మూన్నెళ్ల ముందే పిటిషన్ అనేది పెద్ద సమస్యే. మల్టీప్లెక్స్ రేట్లు 200 నుంచి 295 వరకు పెంచుకునే వెసలుబాటు ప్రభుత్వమే ఇచ్చింది.. అవి కాకుండా ఇంకా రేట్లు అడుగుతున్నారు నిర్మాతలు. అయితే ఈ రేట్ల పెంపుకు కఠిన నిబంధనలు పెట్టి.. రెమ్యూనరేషన్ లేకుండా ప్రొడక్షన్ కాస్ట్ 400 కోట్లు దాటిన సినిమాలకే వారం రోజుల పాటు పెంచుకునే అవకాశం ఉండేలా సర్కార్ ఆలోచిస్తే బెటర్ అనేది ఓ వర్గం వాదన. కోర్ట్ తీర్పు కానీ అమలైతే.. ముందుగా నష్టపోయేది సమ్మర్ సినిమాలే. ఎందుకంటే 90 రోజులు ముందు అంటే ఇప్పుడే పిటిషన్ వేసుకోవాలి. అందులో విశ్వంభర, ఉస్తాద్ లాంటి భారీ సినిమాలకు ఇంకా డేట్సే లాక్ కాలేదు. అలాగే రాబోయే భారీ సినిమాలకు నష్టం తప్పకపోవచ్చు. మరి దీనిపై పై కోర్టుకు వెళ్తారా లేదంటే ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక చట్టం తెస్తుందా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యామిలీ బొమ్మ తియ్.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయ్..

ఒక్క సినిమాతో.. చేజారిన నెంబర్ వన్ పీఠంపై కన్నేసిన బాలీవుడ్

ప్యారడైజ్ Vs పెద్ది.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా

మాకు మేమే.. మాతో మేమే అంటున్న కుర్ర హీరోలు

రూ. 6 వేల నుంచి రూ.10 వేలు !! బడ్జెట్‌లో రైతులకు సాయం పెరగనుందా ??

Follow Us