Silver Wedding Card: జైపూర్‌కు చెందిన శివ జోహరి తన కూతురు శృతి వివాహం కోసం 3 కిలోల వెండితో ప్రత్యేక ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. సుమారు 25 లక్షల ఖర్చుతో రూపొందించిన ఈ అద్భుతమైన వెండి కార్డు, తండ్రి కూతురిపై చూపిన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై 65 దేవతా మూర్తుల రూపాలు చెక్కబడ్డాయి.