Navel Oiling: నాభిలో నూనె అప్లై చేయడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఈ రోజునుంచే మొదలు పెడతారు..
నాభి మన శరీరానికి కేంద్ర బిందువు. ఆయుర్వేదంలో నాభికి ముఖ్యమైన స్థానం ఉంది. ప్రతిరోజూ నాభికి నూనె రాయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. 21 రోజుల పాటు క్రమం తప్పకుండా నాభికి నూనె రాయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇలా నాభికి నూనెను రాయడం ఆరోగ్యంగా ఉండటానికి సహజమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మన శరీరంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించే అనేక అవయవాలు ఉన్నాయి. వాటిలో నాభి ఒకటి. ఆయుర్వేదంలో నాభిని శరీర కేంద్రంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ నాభిలో నూనె వేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో నాభిలో నూనె అప్లై చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అయితే ఈ రోజు ఇలా నాభిలో ఎన్ని రోజులు నూనె అప్లై చేయాలని ఆలోచిస్తుంటే.. ఈ రోజు దానికి సమాధానం తెలుసుకుందాం..
ఎన్ని రోజులు నాభిలో నూనె పొసుకోవాలంటే
ప్రతిరోజూ 21 రోజుల పాటు నాభిలో నూనె వేయాల్సి ఉంటుదని అయితే ఈ అలవాటును ఎప్పటికీ కొనసాగించ వచ్చు. అయితే ఇలా నాభిలో నూనె వేయడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకునేందుకు 21 రోజులు వేచి ఉండాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి , అలసట, కళ్ళు వాపు, జుట్టు రాలడం, దృష్టి లోపం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
21 రోజులు నాభిలో నూనె పోయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే
- నాభిలో నూనె వేయడం వలన జీర్ణవ్యవస్థ బలపడుతుంది. దీనితో పాటు, గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- నాభిలో నూనె అప్లై చేయడం ద్వారా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. నాభిలో కొబ్బరి లేదా బాదం నూనె రాయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పొడిబారడం సమస్యను కూడా తొలగిస్తుంది.
- ఇలా చేయడం జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. చుండ్రు, తల చర్మం పనితీరు సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఎవరికైనా ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలంటే ఈ పద్ధతిని అవలంబించండి.
- ఈ పద్ధతి పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో నాభిలో ఆముదం నూనెను పూయవచ్చు. ఇది కడుపు కండరాలను సడలిస్తుంది.
- నాభిలో నూనె రాయడం వల్ల హార్మోన్ల స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఇది PCOS , PCOD సమస్యను కూడా తొలగిస్తుంది.
- ఎవరైనా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ పద్ధతిని అవలంబించాలి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలసటను కూడా తొలగిస్తుంది.
- నాభిలో నూనె అప్లై చేయడం వలన కలిగే ప్రయోజనాల్లో మరొకటి ఏమిటంటే ఒత్తిడిలో ఉంటే, ఈ పద్ధతి ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు.
నాభిలో నూనెను ఎలా అప్లై చేయాలంటే
- నిద్రపోయే ముందు మీ నాభిని బాగా శుభ్రం చేసుకోండి.
- ఇప్పుడు నాభిలో రెండు మూడు చుక్కల నూనెను వేయండి.
- చేతులతో నాభి చుట్టూ తేలికగా మసాజ్ చేయండి.
- ఇలా నాభిలో వేసే నూనె ఎల్లప్పుడూ సహజ నూనెను ఉపయోగించాలి
- నూనె రాసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.
- గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పద్దతిని ట్రై చేయవద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)







