AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Diet Tips: ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తింటున్నారా.. అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు వెల్కం చెప్పినట్లే..

రోజు మొదటి భోజనం అల్పాహారం. ఆరోగ్యకరమైన జీవితానికి టిఫిన్ తినడం చాలా ముఖ్యం. రోజుని ప్రారంభించడానికి ముందు తినే అల్ఫాహారం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. అంతేకాదు టిఫిన్ తినడం వలన రోజంతా చురుకుగా, ఏకాగ్రతతో ఉండగలరు. అల్పాహారంగా రకరకాల ఆహార పదార్ధాలు తింటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో పొరపాటున కూడా కొన్ని ఆహారపదార్ధాలు తినొద్దు.. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Morning Diet Tips: ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తింటున్నారా.. అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు వెల్కం చెప్పినట్లే..
Morning Diet Tips
Surya Kala
|

Updated on: Jul 25, 2025 | 10:28 AM

Share

అల్పాహారం కేవలం రోజు ప్రారంభంలో తినే భోజనం మాత్రమే కాదు. ఈ అల్ఫాహారం మొత్తం రోజులోని శక్తి, ఆరోగ్యానికి ఆధారం. మనం మన రోజును ఎలా ప్రారంభిస్తాము? మనం ఏమి తింటాము అనేది మన శక్తి, మానసిక స్థితి, జీర్ణక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మనలో చాలా మంది, తెలిసి లేదా తెలియకుండా లేదా తొందరపడి, ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహార పదార్ధాలను తింటారు. ఇవి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి.

కొన్ని రకాల ఆహారపదార్ధాలు తినడం వలన ఆమ్లత్వం, గ్యాస్, అజీర్ణం, కడుపులో అసౌకర్యంగా మండే అనుభూతి వంటి సమస్యలకు దారితీస్తాయి. దీంతో రోజు మొత్తం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కనుక ఎవరైనా ఉదయం నిద్రలేచిన వెంటనే ఆలోచించకుండా ఏదైనా తిని, తరువాత కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఈ రోజు ఉదయం తినే ఆహారంలో ఏ వస్తువులను చేర్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

సిట్రస్ పండ్లు, వాటి రసాలు నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను తినడం లేదా ఉదయం ఖాళీ కడుపుతో వాటి రసం తాగడం కొంతమందికి చాలా హానికరం. ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తిన్నప్పుడు అది నేరుగా కడుపు పొరను ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని వేగంగా పెంచుతుంది.ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. సున్నితమైన కడుపు ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అల్పాహారం తర్వాత లేదా తేలికైన ఫుడ్ ని తిన్న తర్వాత ఈ పండ్లను తినడం మంచిది.

పచ్చి కూరగాయలు, సలాడ్లు పోషకాహారం అయినప్పటికీ పచ్చి కూరగాయలు, సలాడ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో చాలా కఠినమైన ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ.. ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది.

వీటిని తినడం వల్ల కడుపు భారంగా అనిపిస్తుంది. ఒకొక్కసారి ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి సమస్యలను కలిగిస్తాయి. పచ్చి కూరగాయలు కడుపులోని సున్నితమైన పొరను కూడా చికాకుపెడతాయి. ఉడికించిన లేదా తేలికగా ఉడికించిన కూరగాయలు లేదా మొలకలను అల్పాహారంలో చేర్చుకోవడం మంచి ఎంపిక.

కారం, నూనెతో కూడిన ఆహారం ఉదయం ఖాళీ కడుపుతో కారంగా లేదా నూనెతో కూడిన ఆహారాన్ని తినడం కడుపుకు చాలా హానికరం. మిరపకాయలు, నల్ల మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు నేరుగా కడుపు పొరను ప్రభావితం చేస్తాయి. అధిక ఆమ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంటకు కారణమవుతుంది.

మరోవైపు సమోసాలు, కచోరీలు లేదా పరాఠాలు వంటి నూనెతో వేయించిన ఆహారాలు తింటే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కడుపు బరువుగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల అజీర్ణం, కడుపులో బరువు, యాసిడ్ రిఫ్లక్స్ సమస్య పెరుగుతుంది. అందువల్ల ఉదయం ఖాళీ కడుపుతో ఇలాంటి ఆహారాన్ని నివారించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)