AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మఖానా Vs చనా.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?

మఖానా - నానబెట్టిన చనా రెండూ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. స్నాక్స్‌కు మంచి ఎంపిక. మఖానా కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్ యొక్క మంచి మూలం. చనా.. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కొన్ని విటమిన్లకు మంచి మూలం. కానీ ఈ రెండింటిలో ఏది తినడం మంచిదో మీకు తెలుసా..?

Health Tips: మఖానా Vs చనా.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
Makhana Vs Kala Chana
Krishna S
|

Updated on: Aug 06, 2025 | 7:09 PM

Share

మఖానా ఆరోగ్యానికి ఒక వరంలాంటిదని చెబుతారు. ఎందుకంటే ఇది పోషకాల గని. చాలా మంది దీనిని చిరుతిండిగా తినడానికి ఇష్టపడతారు. కానీ ఇది మార్కెట్లో కొంచెం ఖరీదైనది. కానీ చనా తక్కువ ధరకే దొరుకుతుంది. వాస్తవానికి మఖానా – చనా రెండూ శరీరాన్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి. మఖానా ఫైబర్ ఎక్కువగా ఉంటే.. చనా ఐరన్‌కు మంచి మూలం. రెండూ స్నాక్స్‌గా మంచివి. నేటి కాలంలో కాల్చిన మఖానాను స్నాక్‌గా తినడం కామన్‌గా మారిపోయింది. దీంతో పాటు నేటికీ ప్రజలు రాత్రిపూట నానబెట్టిన చనాను స్నాక్‌గా తీసుకుంటారు. రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఈ రెండింటిలో ఏది తినడానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రెండింటిలో ఏది ఎక్కువ బెస్ట్..?

కాల్చిన మఖానా, నానబెట్టిన చనా రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వాటి పోషకాలు, ఉపయోగించే పద్ధతిలో స్వల్ప తేడా ఉంది. కాల్చిన మఖానాలో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా వేయించవచ్చు. ఇది తేలికైనది కావడంతో సులభంగా జీర్ణమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి లేదా మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచుతాయి.

నానబెట్టిన చనా ప్రోటీన్, ఐరన్, పాస్పరస్, ఫైబర్, విటమిన్ B6 యొక్క అద్భుతమైన మూలం. చనా శరీరానికి శక్తిని ఇస్తాయి. కండరాల మద్దతుకు సహాయపడతాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. చనా నానబెట్టడం వల్ల శరీరంలో దానిలో ఉన్న పోషకాల శోషణ మెరుగుపడుతుంది. కడుపుకు సులభంగా జీర్ణమవుతుంది. ఎవరికైనా కడుపు సమస్యలు లేకపోతే.. ఉదయాన్నే నానబెట్టిన చనా తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, చురుకైన వ్యక్తులకు ఇది చాలా మంచిది.

ఏది మంచిది..?

మరోవైపు బరువు తగ్గడానికి తేలికైన, సులభంగా జీర్ణమయ్యే చిరుతిండి కావాలనుకుంటే.. కాల్చిన మఖానా మంచి ఎంపిక. రెండింటినీ సమతుల్య పద్ధతిలో ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..