Shoes Smell: మీ బూట్ల నుంచి దుర్వాసన వస్తోందా? అయితే, ఇలా చేయండి..

మీ పాదాలకు చెమట పట్టడం వల్ల సాక్స్‌, బూట్లు దుర్వాసన వస్తుంటాయి. ఇది సాధారణమే కానీ, చాలాసార్లు దీని వల్ల ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

Shoes Smell: మీ బూట్ల నుంచి దుర్వాసన వస్తోందా? అయితే, ఇలా చేయండి..
Shoes
Follow us

|

Updated on: Nov 23, 2022 | 7:30 AM

మీ పాదాలకు చెమట పట్టడం వల్ల సాక్స్‌, బూట్లు దుర్వాసన వస్తుంటాయి. ఇది సాధారణమే కానీ, చాలాసార్లు దీని వల్ల ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మీ బూట్లు కూడా దుర్వాసన వస్తుంటే.. అలాంటి సమస్య నుంచి ఈజీగా, తక్షణమే ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

దుర్వాసన ఎందుకు వస్తుంది?

ఎక్కువ సేపు బూట్లు ధరించడం వల్ల పాదాలకు చెమట పడుతుంది. ఫలితంగా బూట్లు, సాక్స్‌లు తడిచిపోయి తేమగా మారిపోతాయి. సుదీర్ఘ తేమ కారణంగా.. పాదాలు, సాక్స్, బూట్లలో బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దాంతో వాసన రావడం ప్రారంభం అవుతుంది. పాదాలు, బూట్లు, సాక్సుల నుండి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. బూట్లు, సాక్సులు దుర్వాసన రావడానికి అతి ముఖ్యమైన కారణం చెమట పట్టడం. ఆ సమస్యను తగ్గించడానికి చెమటను శోషించే సాక్సులను ధరించాలి. దాని వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. బూట్లు, అరికాళ్లను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలి.

3. బూట్లలో దుర్వాసన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనిని నివారించడానికి బూట్లు, ఇన్సోల్స్ క్రమ తప్పకుండా కడగాలి.

4. బూట్లను కడిగిన తరువాత బాగా పొడిగా ఉంచడం అవసరం. లేదంటే.. తేమ వాషింగ్ తరువాత కూడా ఉంటుంది. అది బ్యాక్టీరియా పునరుత్పత్తికి కారణం అవుతుంది.

5. బూట్లను ప్రతివారం కడగడం సాధ్యం కాదు. కావున, ఉతికిన ఇన్సోల్‌ను మాత్రమే ఉపయోగించండి. ఇది షూ దుర్వాసన నుంచి చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. షూ లను తాజాగా ఉంచుతుంది.

6. బూట్లు, పాదాలు దుర్వాసన రాకుండా డియోడరెంట్‌ని కూడా ఉపయోగించవచ్చు. పాదాలను పొడిగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే.. పాదాలు పొడిగా ఉంటే బ్యాక్టీరియా, వాసన ఉండదు. అయినప్పటికీ వాసన వస్తే.. పాదాలకు దుర్గంధం రాకుండా ఏదైనా క్రీమ్స్ ఉపయోగించవచ్చు. ఇది బ్యాక్టీరియా పెరగకుండా కూడా నిరోధిస్తుంది.

జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles