Lifestyle: బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే హాయిగా పడుకోండి..

సరైన నిద్ర లేకుండా ఎన్నిరకాల కుస్తీలు పడ్డా బరువు తగ్గడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య బరువు తగ్గించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోందని చెబుతున్నారు. పైగా నిద్రలేమి బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని అంటున్నారు. సాధారణంగా నిద్రలేమి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే హాయిగా పడుకోండి..
Weight Loss
Follow us

|

Updated on: Jul 11, 2024 | 6:21 PM

బరువు తగ్గాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం వర్కవుట్స్‌ మొదలు తీసుకునే ఆహారం వరకు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. డైటింగ్ పేరుతో ఆహారం మానేస్తుంటారు. వర్కవుట్ పేరుతో జిమ్‌లలో కుస్తీలు పడుతుంటారు. అయితే వీటన్నింటితో పాటు హాయిగా నిద్ర కూడా పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రకు, బరువు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సరైన నిద్ర లేకుండా ఎన్నిరకాల కుస్తీలు పడ్డా బరువు తగ్గడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య బరువు తగ్గించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోందని చెబుతున్నారు. పైగా నిద్రలేమి బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని అంటున్నారు. సాధారణంగా నిద్రలేమి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు పెరగడాన్ని బాగా ప్రోత్సాహిస్తుంది.

బరువు పెరగడానికి ప్రధాన కారణాల్లో కార్టిసాల్‌ ఒకటి. ఇది ఒక స్ట్రెస్‌ హార్మోన్‌. నిద్రలేమి కారణంగా విడుదలయ్యే ఈ హార్మోన్‌ శరీరం బరువు పెరగడానికి కారణమవుతుంది. సరిడప నిద్రలేకపోతే శరీరానికి కొవ్వును తగ్గించే సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో శరీరంలో కొవ్వు కరగదు, ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. దీంతో ఎంత ఎక్కువగా పనిచేసినా.. శరీరంలో తక్కువ కేలరీలే బర్న్ అవుతాయి. బరువు తగ్గాలంటే మెటబాలీజం సరిగ్గా ఉండాలి. మెటబాలీజంను కంట్రోల్‌ చేసేది మంచి నిద్రే.

అంతేకాకుండా నిద్రలేమి సమస్య మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకోవడానికి కారణమవుతుంది. ఈ కారణంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే అన్ని సమస్యలకు పరిష్కారం లభించాలంటే కచ్చితంగా సరిపడ నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..