Beauty Tips: జీడిపప్పుతో ఆరోగ్యమే కాదు అందం కూడా..! ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

uppula Raju

uppula Raju |

Updated on: Sep 06, 2021 | 4:26 PM

Beauty Tips: వర్షాకాలంలో చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. వీటిని నయం చేయడానికి దాదాపుగా మార్కెట్లో దొరికే అన్ని ప్రొడక్ట్స్‌ని

Beauty Tips: జీడిపప్పుతో ఆరోగ్యమే కాదు అందం కూడా..! ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
Kaju

Beauty Tips: వర్షాకాలంలో చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. వీటిని నయం చేయడానికి దాదాపుగా మార్కెట్లో దొరికే అన్ని ప్రొడక్ట్స్‌ని వాడుతాము. అయితే జీడిపప్పు కూడా చర్మం రంగును పెంచడానికి దోహదం చేస్తుందని మీకు తెలుసా.. అవును జీడిపప్పు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని మరింత కాంతివంతం చేస్తాయి. జీడిపప్పులో ప్రోటీన్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి కాపాడుతుంది. ఇది కాకుండా జీడిపప్పు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. మీరు జీడిపప్పు ఫేస్ ప్యాక్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

జీడిపప్పు ఫేస్ ప్యాక్ జీడిపప్పు ఫేస్ ప్యాక్ చేయడానికి 8 నుంచి10 జీడిపప్పులను పాలలో నానబెట్టి, అరగంట పాటు ఉంచాలి. తరువాత జీడిపప్పు మెత్తగా రుబ్బి పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌కి రెండు చెంచాల గ్రామ్ పిండిని కలపాలి. మొదటగా పాలలో కాటన్ ముంచి ముఖం, మెడను శుభ్రం చేయాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. ఈ పేస్ట్‌ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకసారి అప్లై చేయాలి. జిడ్డు, పొడి చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ ప్రయోజనకరంగా ఉంటుంది.

జీడిపప్పు ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు జీడిపప్పు ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా ముఖం ముఖం కాంతివంతమవుతుంది. దీనితో పాటు ముఖంపై గీతలను తొలగించడంలో సహాయపడుతుంది. వడదెబ్బ, చర్మశుద్ధి సమస్యను వదిలించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు చర్మాన్ని పోషించడానికి బిగించడానికి చక్కగా పనిచేస్తుంది.

Old Coin: అదిరిపోయే ఆఫర్..మీ దగ్గర ఆ రెండు రూపాయల కాయిన్ ఉందా.. అయితే, మీరు లక్షాధికారులు కావచ్చు..ఎలా అంటే..

Rohit-Ritika Love Story: యాడ్ ద్వారా పరిచయం..యువీ వార్నింగ్.. రోహిత్-రితికాల లవ్‌స్టోరీలో ఎన్నో ట్విస్టులు..

Bigg Boss 5: ‘అరే ఏంట్రా ఇది’.. హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. యాంకర్ రవి, షణ్ముఖ్‌‌లే టార్గెట్.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu