Lifestyle: మైగ్రేన్‌ నొప్పికి సింపుల్ చిట్కా.. నిజంగానే పనిచేస్తుందా.?

మైగ్రేన్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు సాధారణంగా ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాంటి వాటిలో వేడి నీటిలో కాళ్లు పెట్టడం వల్ల ఈ సమస్య నుంచి ఇట్టే బయటపడొచ్చని చెబుతుంటారు..

Lifestyle: మైగ్రేన్‌ నొప్పికి సింపుల్ చిట్కా.. నిజంగానే పనిచేస్తుందా.?
Migraine Pain
Follow us

|

Updated on: Oct 28, 2024 | 4:41 PM

మైగ్రేన్‌ నొప్పి.. ఇటీవల చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వినడానికి చిన్న సమస్యగానే అనిపించినా దీని బారిన పడిన వారు మాత్రం నరకం అనుభవిస్తుంటారు. తలలో భరించలేని నొప్పి వస్తుంటుంది. అయితే మైగ్రేన్‌ నొప్పికి ఎన్నో సహజ చిట్కాలను పాటిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి వేడి నీటిలో కాళ్లు పెట్టడం. వేడి నీటిలో పాదాలు ఉంచడం వల్ల మైగ్రేన్‌ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందన్న దాంట్లో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గించడంలో ఎన్నో రకాల సహజ చిట్కాలు ఉంటాయి. సహజంగా ఆవిరి పట్టుకోవడం, శ్వాస సంబంధిత యోగా.. మెడిటేషన్‌ వంటివి చేయాలని చెబుతుంటారు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో మరో చిట్కా కూడా వైరల్‌ అవుతోంది. మీ పాదాలను వేడి నీటిలో పెట్టడం వల్ల మైగ్రేషన్‌ నొప్పి తగ్గుతుందని నెట్టింట వైరల్‌ అవుతోంది.

వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ చిట్కా.. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని అంటున్నారు. అయితే గోరు వెచ్చని నీటిలో కాళ్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయని, ఇది మైగ్రేన్‌ నొప్పిని దూరం చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తపోటును తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర ఉపయోగపడుతుంది.

మైగ్రేన్‌ నొప్పికి పెయిన్‌ కిల్లర్స్‌, స్ప్రేలు ఉపయోగించడం కంటే ఇలా వేడి నీటి చిట్కా మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. గోరువెచ్చని నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు పెట్టాలి. అయితే నీరు 37 నుంచి 43 డిగ్రీల మధ్య ఉండాలి. అంతకంటే ఎక్కువ వేడి ఉండడం మంచిది కాదని అంటున్నారు. ఇక వేడి నీటిలో లావెండర్‌ ఆయిల్‌, ఆముదం వంటివి వేడి నీటిలో వేసుకుంటే మరింత మేలు జరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మైగ్రేన్‌ నొప్పికి సింపుల్ చిట్కా.. నిజంగానే పనిచేస్తుందా.?
మైగ్రేన్‌ నొప్పికి సింపుల్ చిట్కా.. నిజంగానే పనిచేస్తుందా.?
భోజనం చేశాక స్నానం చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
భోజనం చేశాక స్నానం చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
బిగ్ బాస్ ద్వారా మెహబూబ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్ బాస్ ద్వారా మెహబూబ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
టీమిండియాలో చోటు ఏకంగా 17 కిలోలు తగ్గిన గంభీర్ ఫేవరేట్ ప్లేయర్
టీమిండియాలో చోటు ఏకంగా 17 కిలోలు తగ్గిన గంభీర్ ఫేవరేట్ ప్లేయర్
ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతంటే
ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతంటే
కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..
కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..
హాయిగా బజ్జో నాన్నా! కుమారుడి ఒడిలో నిద్రపోయిన హార్దిక్ పాండ్యా
హాయిగా బజ్జో నాన్నా! కుమారుడి ఒడిలో నిద్రపోయిన హార్దిక్ పాండ్యా
‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..!
‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..!
వామ్మో.. ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజరే..
వామ్మో.. ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజరే..
ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!