AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 10 వేల అడుగులు గుండె ఆరోగ్యానికి వరం..! అంటే ఎన్ని కిలోమీటర్లో తెలుసా..?

ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే తప్పనిసరిగా, యోగా, ప్రాణాయామం, వ్యాయామాలు అలవాటు చేసుకోవటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, అందరికీ వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. అలాంటివారు రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల వ్యాయామం చేసినన్నీ ప్రయోజనాలు పొందొచ్చని చెబుతుంటారు. వాకింగ్‌ అనేది ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. గుండె, మనస్సు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రోజుకు 10 వేల అడుగులు గుండె ఆరోగ్యానికి వరం..! అంటే ఎన్ని కిలోమీటర్లో తెలుసా..?
10000 Steps
Jyothi Gadda
|

Updated on: Jul 25, 2025 | 1:52 PM

Share

రోజూ 10,000 అడుగులు నడవడం బరువు తగ్గడానికి, బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా తగ్గిపోతుంది. వాకింగ్‌లో రోజూ 10,000 అడుగులు నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెను బలపరుస్తుంది. శరీరంలోని రక్తపోటు స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది.

ఉదయం లేదా రోజులో ఎప్పుడైనా 10,000 అడుగులు నడవడం వల్ల శరీర శక్తి స్థాయి పెరుగుతుంది. నడక వల్ల శరీరం రోజంతా ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంటుంది. అందుకే రోజూ 10,000 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. నడక శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

10000వేల నడక అంటే.. పెద్దవారి స్ట్రైడ్​అడుగు పొడవును బట్టి దాదాపు 64 నుంచి 76.2 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వీరి నడక సగటు వేగం 2 నుంచి 4 మైళ్లు అంటే.. 3.2 నుంచి 6.4 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇక, వివిధ ఉపరితలాలను బట్టి వేగం మారుతుంది. అలా 10 వేల అడుగులు నడిస్తే 5 మైళ్లు అంటే 8 కిలో మీటర్లు నడిచినట్లు అవుతుంది. వాకింగ్‌ వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులకు వాకింగ్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..