నెలసరి రోజుల్లో కోడి గుడ్లను తింటే ప్రమాదమా? శరీరంలో ఏం జరుగుతుంది.. మహిళలు తప్పక తెలుసుకోవాల్సిందే..
మహిళల్లో ఋతుస్రావం (పీరియడ్స్) అనేది ఒక నిర్దిష్ట విరామం తర్వాత శరీరంలో సంభవించే ఒక సాధారణ ప్రక్రియ. కానీ పీరియడ్స్ విషయంలో చాలా రకాల అపోహలు అమ్మాయిల్లో ఉన్నాయి.

మహిళల్లో ఋతుస్రావం (పీరియడ్స్) అనేది ఒక నిర్దిష్ట విరామం తర్వాత శరీరంలో సంభవించే ఒక సాధారణ ప్రక్రియ. కానీ పీరియడ్స్ విషయంలో చాలా రకాల అపోహలు అమ్మాయిల్లో ఉన్నాయి. పీరియడ్స్ గురించి ఈ అపోహలు అమ్మమ్మల కాలం నుంచి కొనసాగుతున్నాయి. ఈ అపోహల్లో ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదు అనే దానిపై ఎక్కువగా చర్చ జరుగుతుంది.
నిజానికి రజస్వల అయినప్పటి నుంచి ప్రతీ అమ్మాయిలోనూ కలిగే సహజమైన మార్పు పీరియడ్స్ రావడం. అయితే దీనిపై చదువులేకపోవడం వల్ల చాలా మందిలో భ్రమలు ఉన్నాయి. పీరియడ్స్ వెనుక ఉన్న సైన్స్ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకోవాలి. రజస్వల అయిన ప్రతీ యువతి జననేంద్రియంలో అండం విడుదల అవుతుంది. ప్రతీ నెల విడుదలయ్యే ఈ అండం ఫలదీకరణ జరగకపోతే, అది ‘పీరియడ్స్’ అనే ఎండోమెట్రియల్‌లో రక్తస్రావంగా బయటకు వచ్చేస్తుంది. ఈ రక్తస్రావం 3 నుంచి 5 రోజుల వరకూ జరుగుతుంది. ఈ సమయంలో స్త్రీలలో సాధారణంగా పొత్తికడుపులో నొప్పి, నడుం నొప్పి, కండరాలు బిగుసుకుపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి.
పీరియడ్స్ కి సంబంధించి డైట్ విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో కోడి గుడ్లు తినాలా వద్దా? ఉంది అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పీరియడ్స్ సమయంలో గుడ్లు తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు, అలాగే నష్టాలు సైతం ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు పీరియడ్స్ సమయంలో గుడ్లు తినవచ్చు. కానీ గుడ్డు చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ కాలంలో గుడ్లను తక్కువగా తినాలి. గరిష్టంగా పీరియడ్స్ సమయంలో రోజుకు 1 నుండి 2 గుడ్లు తినవచ్చు. ఇంతకంటే ఎక్కువ గుడ్లు తినకూడదు.




పీరియడ్స్ సమయంలో గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుడ్డు చాలా పోషకమైన ఆహారం. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. మీరు పీరియడ్స్ సమయంలో గుడ్లు తింటే అది మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే స్త్రీ పీరియడ్స్ కాలంలో బలహీన పడుతుంది. ఈ సందర్భంలో, గుడ్డు మీకు మంచి ఆహారం. కోడి గుడ్డులోని కొవ్వు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే ప్రోటీన్ లోపాన్ని పూర్తి చేస్తుంది.
పీరియడ్స్ సమయంలో గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు:
పీరియడ్స్ కాలంలో పరిమితికి మించి అతిగా గుడ్లు తింటే అది మీకు హాని కలిగిస్తుంది. ఎక్కువ మొత్తంలో గుడ్లను తింటే ఎసిడిటీ పెరగవచ్చు. కడుపులో వేడి పెరగడం వల్ల తిమ్మిర్లు వస్తాయి. ఫలితంగా పీరియడ్స్ నొప్పి పెరగవచ్చు. అజీర్ణ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



