Diabetes: డయాబెటిస్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాల కంటే కొబ్బరి నీటిలో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ఇందులోని కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా తినే వ్యక్తులు వారి శరీరంలో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లను పొందుతారు. లేత కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీరం నుంచి ట్యాక్సిన్లు తొలగిపోతాయి...

Diabetes: డయాబెటిస్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు.
Coconut Water
Follow us

|

Updated on: May 18, 2024 | 1:33 PM

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎలక్ట్రోలైట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు రుచి విషయంలో తియ్యగా ఉంటాయి. దీంతో డయాబెటిస్‌ రోగులు కొబ్బరి నీళ్లు తాగ కూడదనే భావనలో ఉంటారు. ఇంతకీ డయాబెటిస్‌ రోగులు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎమైనా ప్రమాదం ఉంటుందా.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాల కంటే కొబ్బరి నీటిలో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ఇందులోని కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా తినే వ్యక్తులు వారి శరీరంలో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లను పొందుతారు. లేత కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీరం నుంచి ట్యాక్సిన్లు తొలగిపోతాయి.

అయితే కొబ్బరి నీళ్లు తియ్యగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్‌ పేషెంట్లకు మంచిది కాదనే అభిప్రాయంలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీటిని ఎలాంటి సందేహం లేకుండా తాగొచ్చని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. లేత కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొబ్బరిని తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా చూస్తుంది.

ఇక కొబ్బరి బోండ లోపల ఉండే కొబ్బరిని కూడా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయపడే అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, క్రీమ్ తినడం వల్ల శరీర కొవ్వు తగ్గుతుంది, అందువల్ల క్రీమ్‌ను రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త