IRCTC Tourism: హైదరాబాద్ అందాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్లాన్.. శ్రీశైలం కూడా చూట్టేయచ్చు..
నిజాం సమయంలో కట్టిన అద్భుతమైన కట్టడాలు ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఆహార అలవాట్లు ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ, హలీమ్ వంటి ప్రసిద్ధ వంటకాలు ఈ నగరాన్ని పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీ రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా సామాన్య ప్రజల ప్రయోజనం కోసం తరచుగా టూర్ ప్యాకేజీలను కూడా ప్రారంభిస్తుంది.
హైదరాబాద్ నగరమంటేనే చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ నగరంలో నిజాం నవాబుల వారసత్వంతో పాటు తెలంగాణ సంస్కృతిని మిలితమై ఉంటుంది. కాబట్టి నిజాం సమయంలో కట్టిన అద్భుతమైన కట్టడాలు ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఆహార అలవాట్లు ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ, హలీమ్ వంటి ప్రసిద్ధ వంటకాలు ఈ నగరాన్ని పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీ రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా సామాన్య ప్రజల ప్రయోజనం కోసం తరచుగా టూర్ ప్యాకేజీలను కూడా ప్రారంభిస్తుంది. ఐఆర్‌సీటీ హైదరాబాద్‌కు సంబంధించి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ హైదరాబాద్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరంతో పాటు శ్రీశైలం శివయ్యను దర్శించుకోవాలనుకునే వారికి అనువుగా ‘హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ విత్ శ్రీశైలం’ పేరుతో ఈ ప్యాకేజ్ ఐఆర్‌సీటీ రిలీజ్ చేసింది. ఈ టూర్ ప్యాకేజీ వ్యవధి మూడు రాత్రులు నాలుగు పగళ్లు. ఈ టూర్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఆదివారం నుంచి గురువారం వరకు ఉంటుంది.
హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ ధరలు
- ఈ టూర్ ప్యాకేజీ ఒక వ్యక్తికి ధర రూ. 36,270.
- ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర రూ.19,070.
- ముగ్గురు వెళితే ఒక్కో వ్యక్తికి రూ.14,570.
- 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బెడ్‌తో, ధర రూ.9,590 అవుతుంది.
- మంచం అవసరం లేకుండా 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, ధర రూ. 9,590 అవుతుంది.
టూర్ వివరాలివే
మొదటి రోజు
పర్యాటకులు హైదరాబాద్/సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకుంటారు. వారు ఒక హోటల్‌కు వెళ్లి సేదతీరా ఆపై వారు చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్కును సందర్శనకు తీసుకెళ్తారు. వారు తిరిగి హోటల్‌కు వచ్చి రాత్రి అక్కడే బస చేస్తారు.
రెండవ రోజు
పర్యాటకులను ఉదయం 5 గంటలకు హోటల్ నుంచి పికప్ చేసుకుంటారు. అనంతరం వారిని రోడ్డు మార్గంలో శ్రీశైలానికి కారులో తీసుకెళ్తారు. మల్లికార్జున దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు అవకాశం ఇస్తారు. మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరి రాత్రికి చేరుకుంటారు.
మూడో రోజు
పర్యాటకులను మూడో రోజు రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్తారు. తిరిగి హోటల్‌కు వచ్చి బస చేయాలి.
నాలుగో రోజు
హోటల్ నుంచి బయలుదేరాక బిర్లా మందిర్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులను సందర్శిస్తారు. సాయంత్రం వారిని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో? అదే ప్రాంతానికి తీసుకెళ్లి దింపుతారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..