Ink Stain Removal Tips: బట్టలపై పెన్ మరకలు చిటికెలో తొలగించే చిట్కా..! మీరూ ట్రై చేయండి..
స్కూల్ పిల్లలకు వారి బట్టలపై పెన్ ఇంక్ మరకలు పడటం సాధారణమే. అయితే బట్టలపై ఈ మరకలు ఓ పట్టాన తొలగిపోవు. చాలా మంది మహిళలకు ఉండే సమస్య ఇది. ముఖ్యంగా బట్టలపై కనిపించే పెన్ ఇంక్ మరకలు ఎంత ఉతికినా ప్రయోజనం ఉండదు. వీటిని తొలగించడం ఒక పెద్ద టాస్కే..

ఇంట్లో గృహిణులు చేసే పనులకు అంతంటూ ఉండదు. నిద్ర లేచింది మొదలు అలుపెరుగక చేస్తూనే ఉంటారు. అయితే వారికి అతిపెద్ద తలనొప్పి పిల్లల బట్టలపై ఉండే మురికి వదిలించడం. బట్టల నుంచి మరకలు ఓ పట్టాన తొలగిపోవు. చాలా మంది మహిళలకు ఉండే సమస్య ఇది. ముఖ్యంగా బట్టలపై కనిపించే పెన్ ఇంక్ మరకలు ఎంత ఉతికినా ప్రయోజనం ఉండదు. వీటిని తొలగించడం ఒక పెద్ద టాస్కే. స్కూల్ పిల్లలకు వారి బట్టలపై పెన్ ఇంక్ మరకలు పడటం సాధారణమే. కానీ దాన్ని వదిలించుకోవడం చాలా పెద్ద పని. దొరికిన సబ్బులన్నింటినీ ఉపయోగించినా.. ఫలితం ఉండదు. ఇలాంటి వారికి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ దీప్తి కపూర్ చక్కని చిట్కా చెబుతున్నారు. ఈ కింది వీడియోలో బట్టలపై ఇంక్ మరకలు చిటికెలో ఎలా వదిలించాలో వివరించారు..
పెన్ను మరకలను ఎలా తొలగించాలి?
బట్టలపై ఇంక్‌ను తొలగించడానికి ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులు సరిపోతాయి. ముందుగా, పెన్ ఇంక్ తాకిన ప్రదేశంలో హ్యాండ్ శానిటైజర్, డెట్టాల్ లేదా సావ్లాన్ వంటి క్రిమినాశక ద్రవాన్ని కొద్ది మొత్తంలో పూయాలి. ఆ తర్వాత మృదువైన బ్రష్ (టూత్ బ్రష్) సహాయంతో తడిసిన ప్రాంతాన్ని సున్నితంగా రుద్దితే సరి. చిటికెలో మరక మాయం. అయితే బ్రష్‌తో గట్టిగా రుద్దడం చేయకూడదు. అలా చేయడం వల్ల ఫాబ్రిక్ దెబ్బతిని చిరిగిపోతుంది.
View this post on Instagram
ఇది కొన్ని నిమిషాల్లోనే సిరా మరకను తొలగిస్తుంది. తర్వాత ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. బట్లలపై ఎలాంటి పెన్ మరకలనైనా ఇది చిటికెలో తొలగిస్తుంది. హ్యాండ్ శానిటైజర్, డెట్టాల్, సావ్లాన్ ఆల్కహాల్ ఆధారితమైనవి సిరా మరకను కరిగించి ఫాబ్రిక్ నుంచి సులువుగా తొలగిస్తాయి. ఏదైనా ఫాబ్రిక్‌పై ఇలా చేసే ముందు, ముందుగా ఫాబ్రిక్ అంచున దాన్ని పరీక్షించడం మంచిది.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.








