AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: సక్సెస్ కావాలంటే ఈ 6 హ్యాబిట్స్ వదిలేయండి.. ఎలాన్ మస్క్ విజయ రహస్యాలు!

Elon Musk success tips: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జీవితంలో విజయం సాధించాలంటే సమయం వృథా చేయకుండా ముందుకు సాగిపోవాలని చెబుతున్నారు. మొదట, సమర్థవంతమైన భావాలతో, జీవితాన్ని మార్చే నిర్ణయాల కోసం బయటికి చూసే ముందు.. మన అంతర్గత విషయాలను పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. భారీ విజయాలను అందుకోవాలంటే మనకున్న కొన్ని అలవాట్లను మార్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Elon Musk: సక్సెస్ కావాలంటే ఈ 6 హ్యాబిట్స్ వదిలేయండి.. ఎలాన్ మస్క్ విజయ రహస్యాలు!
Elon Musk
Rajashekher G
|

Updated on: Jan 15, 2026 | 12:28 PM

Share

ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త. ప్రపంచంలో అత్యంత ప్రభావశాలురుగా భావించే వ్యాపార నాయకులలో ఆయన ముందు వరుసలో ఉంటారు. విజయం సాధించాలనుకునే వారికోసం ఆయన తన ఆలోచనలను పంచుకొంటున్నారు. విజయం కేవలం మనం కొత్త ఆలోచనలతో ప్రారంభించే కార్యక్రమాలతోనే సాధ్యం కాదని.. మనల్ని వెనక్కి లాగే అలవాట్లను మానుకోవడం వల్ల అవుతుందని మస్క్ అంటున్నారు.

సమర్థవంతమైన భావాలతో, జీవితాన్ని మార్చే నిర్ణయాల కోసం.. బయటికి చూసే ముందు మన అంతర్గత విషయాలను పరిశీలించుకోవాలని ఎలాన్ మస్క్ సూచిస్తున్నారు. భారీ విజయాలను అందుకోవాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. లేదంటే విజయం సాధ్యం కాదని అంటున్నారు. లక్ష్యాన్ని సాధించాలంటే 6 నిబంధనలు తప్పకుండా అవసరమని చెబుతున్నారు.

1. విమర్శలు మిమ్మల్ని నియంత్రిచొద్దు

మీకు ఎదురైన విమర్శలు మిమ్మల్ని పీడిస్తే.. అప్పుడు మన భావనలు చిన్నగా మారి పోతాయి. అందుకే, మీ ప్రతిభ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ప్రతి విమర్శను బాగానే అర్థం చేసుకుని ఉపయోగించండి. కానీ, వాటి వల్ల మీ ధైర్యాన్ని కోల్పోవద్దు అని ఎలాన్ మస్క్ స్పష్టం చేస్తున్నారు.

2. నిర్ణయాల అమలులో ఆలస్యం వద్దు

చాలా మంది తాము ఎదైనా చేయాలంటే.. “సరైన సమయం” కోసం ఎదురుచూస్తారు. అలా చేస్తే మీరు జీవితకాలం పాటు అలాగే ఉండిపోతారని హెచ్చరిస్తున్నారు. నిర్ణయాలు అమలులో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని మస్క్ స్పష్టం చేస్తున్నారు. మొదలు పెట్టడానికి కాస్త సందేహం ఉన్నా కూడా ముందుకు పోవాలి. అదే పెద్ద విజయాలకు దారితీస్తుంది.

3. గత వైఫల్యాల వెంట పెట్టుకోవద్దు

మన గతంలో జరిగిన తప్పిదాలను గుర్తు చేసుకుంటూ మనల్ని మనం నిరుత్సాహపరచకూడదు. ప్రతి విఫలం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. అలాంటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఉండిపోవద్దు. వైఫల్యాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు.

4. ఒకేసారి చాలా పనులు చేయటం

ఒకేసారి చాలా పనులు చేయడం సమయాన్ని తగ్గిస్తుందని భావించినప్పటికీ.. అది చేసే పనిలో నాణ్యతను లోపించేలా చేస్తుంది. దీంతో చేసిన పనులు పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అందుకే, చేసే ఒక పని కూడా పూర్తిగా దానిపై దృష్టి కేంద్రీకరిస్తే.. విజయం సాధ్యమవుతుంది. అందుకే ప్రతీ పనికీ ఒక సమయం కేటాయించి.. వాటిని చేసుకుంటూ వెళితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. ఇది స్పష్టమైన అభివృద్ధిని ఇస్తుందని మస్క్ చెబుతున్నారు.

5. అసౌకర్యం, కష్టాలను తప్పించటం

మనం కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. కానీ, అది మన జీవితంలో ఎలాంటి ఎదుగుదలను చూపించదు. కంఫర్ట్ జోన్ వీడి కష్టాలను ఎదుర్కొనేందుకు ధైర్యం చేస్తేనే విజయం లభిస్తుందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. విజయం కోసం మన మార్గం కష్టంతో కూడకున్నదైతేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు.

6. అర్థం లేని ఇంటర్నెట్ స్క్రోలింగ్ / డిజిటల్ నిర్లక్ష్యం

సోషల్ మీడియాలో మనం చాలా సమయాన్ని వృథా చేస్తుంటాం. అవసరం లేకున్నా ఏదో ఒకటి చూస్తూ టైంపాస్ చేస్తుంటాం. అయితే, ఇది మన సృజనాత్మకను తగ్గిస్తుందని ఎలాన్ మస్క్ హెచ్చరిస్తున్నారు. అవసరం లేకున్నా ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం అనేది తగ్గించాలని సూచిస్తున్నారు. ఎక్కువ సమయాన్ని మనం మన లక్ష్యాలపై పెడితేనే విజయం సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు ఎలాన్ మస్క్.

ముందుకు సాగితేనే విజయం

విజయం వెతుక్కుంటే దొరకదని ఎలాన్ మస్క్ చెబుతారు. దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని అంటున్నారు. విజయం రావాలంటే ఏదైనా కొత్త ఆలోచనలతో పని మొదలు పెడితే సరిపోదని.. మనల్ని వెనక్కి లాగే అలవాట్లను కూడా వదులుకోవాలని సూచిస్తున్నారు. జీవితంలో ప్రతి విజయంలో మనం చేసే ఆలోచనలు, వాటిని అమలు చేసే విధానం, చర్యలు పెద్ద పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అందుకే సమయాన్ని వృథా చేయకుండా ముందుకు కదలడం విజయానికి తొలి మెట్టు అని ఎలాన్ మస్క్ స్పష్టం చేస్తున్నారు.