Dream: కలలో ఇవి కనిపిస్తే భవిష్యత్‌లో ఆ సంఘటనలు.. కొన్ని శుభాలు మరికొన్ని అశుభాలు..!
Dream: కలలు మనందరి జీవితంలో ఒక భాగం. ప్రతీ వ్యక్తి నిద్రపోయేటప్పుడు కలలు కనడం సర్వసాధారణం. కొంతమంది ఆ రోజు వారి జీవితంలో జరిగిన సంఘటనలను కలలో చూస్తే..
Dream: కలలు మనందరి జీవితంలో ఒక భాగం. ప్రతీ వ్యక్తి నిద్రపోయేటప్పుడు కలలు కనడం సర్వసాధారణం. కొంతమంది ఆ రోజు వారి జీవితంలో జరిగిన సంఘటనలను కలలో చూస్తే.. మరికొందరు సంతోషకరమైన మధురానుభూతులను కలలో చూస్తుంటారు. కొన్నిసార్లు కలలో కనిపించే దృశ్యాలు అర్థవంతంగా కనిపిస్తాయి, మరికొన్నిసార్లు అవి పూర్తిగా అసంబద్ధంగా ఉంటాయి. అయితే ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అది మన భవిష్యత్తు పరిస్థితులకు సూచికగా నిలుస్తుంది. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు చాలాసార్లు నిజమవుతాయని పండితులు చెబుతుంటారు. కలలని రెండింటిగా విభజించారు. కొన్ని పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయని, మరికొన్ని నెగటివ్ ఎనర్జీతో ఉంటాయని పేర్కొన్నారు. మరి మన భవిష్యత్తులో రాబోయే కష్టాలకు సంకేతంగా నిలిచే కలలు ఏంటో తెలుసుకుందాం.
కలలో శివలింగాన్ని చూడటం: కలలో శివలింగాన్ని చూడటం మంచి సంకేతం. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కలలో శివలింగం కనిపిస్తే ఆ వ్యక్తి భవిష్యత్తులో శుభ ఫలితాలను పొందబోతున్నాడని అర్థం. ఆ వ్యక్తి కోరిక నెరవేరుతుంది.
కలలో ఆలయం కనిపించడం: ఎవరైనా కలలో దేవాలయం, ఏదైనా పెద్ద రాజభవనం లేదా ఉదయించే సూర్యుడు కనిపిస్తే భవిష్యత్తుకు శుభసూచకాలు. ఆ వ్యక్తి పనిలో విజయం సాధిస్తాడని అర్థం.
ఆకాశంలో ఎగురుతూ: ఒక కలలో మీరు నది లేదా చెరువులో తేలుతున్నట్లు లేదా ఎగురుతున్నట్లు కనిపిస్తే అతి త్వరలో మీరు ఏదో ఒక పనిలో విజయం సాధిస్తారని అర్థం. త్వరలో మీ పని నెరవేరుతుందని సూచిస్తుంది.
ఎర్రటి చీరలో ఉన్న స్త్రీని కనిపించడం: ఎర్రటి చీర లేదా పదహారు ఉంగరాలు ధరించిన స్త్రీని కలలో చూడటం అంటే త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని అర్థం.
శంఖం కనిపించడం: మీరు కలలో శంఖం లేదా గంట మోగిన శబ్దం విన్నట్లయితే అతి త్వరలో మీకు డబ్బు వస్తుందని అర్థం. అలాంటి కల శుభపరిణామంగా భావిస్తారు.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.)