Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hygiene Mistakes: మగ మహారాజులు బీ కేర్‌ఫుల్.. ఈ అలవాట్లు మానుకోపోతే పెను ముప్పే

చాలా మంది పురుషులు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. ఇది అనుకోకుండా బ్యాక్టీరియాతో పాటు జెర్మ్స్‌తో బాధపడేలా చేస్తుంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల పరిశుభ్రతను కోల్పోతున్నామో? గుర్తించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Hygiene Mistakes: మగ మహారాజులు బీ కేర్‌ఫుల్.. ఈ అలవాట్లు మానుకోపోతే పెను ముప్పే
Men
Follow us
Srinu

|

Updated on: Apr 14, 2023 | 6:00 PM

వ్యక్తిగత పరిశుభ్రత అనేది మన జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది వ్యక్తిత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. అలాగే వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే చాలా మంది పురుషులు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. ఇది అనుకోకుండా బ్యాక్టీరియాతో పాటు జెర్మ్స్‌తో బాధపడేలా చేస్తుంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల పరిశుభ్రతను కోల్పోతున్నామో? గుర్తించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిని గుర్తించి పరిశుభ్రత పద్ధతులను మెరుగుపరచడం చాలా ముఖ్యం. చాలా మంది పురుషులు తమ వ్యక్తిగత పరిశుభ్రతతో చేసే సాధారణ తప్పులు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలో ఓ సారి తెలుసుకుందాం.

ముఖం కడిగే సమయంలో జాగ్రత్తలు

చాలా మంది పురుషులు సబ్బుతో ముఖం కడిగే సమయంలో బుగ్గల ప్రాంతాన్ని వదిలేస్తారు. అక్కడ సరిగ్గా సబ్బు పట్టేలా రుద్దకుండా సింపుల్‌గా ముఖం కడిగేస్తారు. ఈ అలవాటు చాలా తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అరచేతిలో సబ్బును నురుగు వచ్చేలా రుద్దుకుని అప్పుడు ముఖం మొత్తాన్ని శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.

లోదుస్తులతో పడుకోవడం

పురుషుల్లో చాలా మంది అండర్‌వేర్‌తోనే పడుకుంటారు. లోదుస్తులతో పడుకోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ వద్ద చెమట పట్టే అవకాశం ఉంటుంది. దీంతో దురుద వంటి సమస్యలు వేధిస్తాయని పురుషులు వీలైనంతగా లోదుస్తులతో పడుకోకపోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ ప్రాంతంలో శుభ్రత

పురుషులకు ముఖ్యంగా అవసరం లేని ప్రాంతాల్లో వెంట్రుకల పెరగడం వల్ల ఆ ప్రాంతంలో చెమట పట్టి దురద ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో రేజర్‌తో షేవ్ చేయడం కంటే ట్రిమ్మింగ్ చేసుకోవడం ఉత్తమం.

బెడ్‌షీట్ పరిశుభ్రం

పడుకునే బెడ్‌షీట్‌ను కొంత మంది రోజుల తరబడి శుభ్రం చేయరు. దీని వల్ల  కూడా బ్యాక్టిరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంతగా బెడ్ షీట్‌ను వారానికి ఓ సారి వేడి నీటితో శుభ్రం చేయడం ఉత్తం.

నాలుక గీసుకోవడం

చాలా మంది బ్రష్ చేసుకునే సమయంలో నాలుక గీసుకోవడం అశ్రద్ధ వహిస్తారు. అయితే ఇలా చేసే వారిలో నాలుకపై బ్యాక్టిరియా వృద్ధి చెందుతుంది. అందువల్ల బ్రష్ చేసే సమయంలో నాలుక గీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పళ్లను తొముకున్నాక ప్లాక్స్ చేయడం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. అలాగే దంత పరిశుభ్రతను కాపాడుకోవడానికి పుష్కలంగా నీరు తాగడం, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, అలాగే టీ, పాలు, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు. 

తలస్నానం చేయడం

చాలా మంది పురుషులు తరచూ తల స్నానం చేయడంలో అశ్రద్ధ వహిస్తారు. అలాగే తలకు నూనె కూడా పెట్టుకోరు. అందువల్ల తల దుర్వాసన రావడంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి పురుషులు కేశ సౌందర్యం కోసం తరచూ జుట్టుకు నూనె పెట్టుకోవడంతో పాటు వారానికి రెండుసార్లైనా తల స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..