Black Tea For Hair: అందమైన జుట్టుకోసం బ్లాక్‌ టీ..! ఇలా వాడితే పట్టులాంటి..

దీంతో మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ మంచి ఆరోగ్యవంతంగా మారుతుంది. దీనికోసం బ్లాక్‌ టీని తయారు చేసుకుని వినియోగించుకోవాలి.. దీని కోసం, 2 కప్పుల నీటిని తీసుకొని అందులో 4-5 స్పూన్ల టీ పొడిని కలపండి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేయండి.

Black Tea For Hair: అందమైన జుట్టుకోసం బ్లాక్‌ టీ..! ఇలా వాడితే పట్టులాంటి..
Black Tea For Hair
Follow us

|

Updated on: Aug 10, 2024 | 9:22 PM

తెల్ల జుట్టు, తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. నేటి బిజీ జీవిన విధానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా చిన్న వయస్సులోనే చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక తెల్లబడిన జుట్టును తిరిగి నల్లగా మార్చేందుకు నానా తంటాలు పడుతుంటారు. కొంత మంది డై, హెయిర్ కలర్ లాంటివి వాడుతుంటారు. అయితే, వాటిలో ఉపయోగించే కెమికల్స్ మీ జుట్టును మరింతగా పాడు చేస్తాయి. జుట్టు రాలిపోయే సమస్య కూడా మరింత తీవ్రం అవుతుంది. అయితే బ్లాక్ టీతో జుట్టు సమస్యలను పరిష్కరించుకోవచ్చునని మీకు తెలుసా..? బ్లాక్ టీతో మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

తెల్ల జుట్టును నేచురల్ గా డార్క్ చేయడానికి టీ పొడి ఉపయోగపడుతుంది. టీ ఆకులలో టానిక్ యాసిడ్ కనిపిస్తుంది. ఇది తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు పనిచేస్తుంది. దీంతో మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ మంచి ఆరోగ్యవంతంగా మారుతుంది. దీనికోసం బ్లాక్‌ టీని తయారు చేసుకుని వినియోగించుకోవాలి.. దీని కోసం, 2 కప్పుల నీటిని తీసుకొని అందులో 4-5 స్పూన్ల టీ పొడిని కలపండి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేయండి.

తెల్ల జుట్టు నల్లగా మారాలంటే బ్లాక్ టీని కాఫీ కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం 2 కప్పుల నీళ్లు తీసుకుని అందులో 4 చెంచాల టీ పొడి, 2-3 చెంచాల కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లబడిన తర్వాత, బ్రష్ సహాయంతో మీ జుట్టుకు అప్లై చేయండి. సుమారు 1 గంట పాటు జుట్టు మీద ఉంచండి. తర్వాత జుట్టును నీటితో కడగాలి.

ఇవి కూడా చదవండి

తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, బ్లాక్ టీ, ఓమ గింజలను ఉపయోగించవచ్చు. దీని కోసం, 2 గ్లాసుల నీటిని వేడి చేయండి. దానికి 2 చెంచాల టీ పొడి, 2 చెంచాల ఓమక్కలు వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లలో 2 చెంచాల హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి.ఇప్పుడు దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి సుమారు గంటసేపు అలాగే ఉంచాలి.తర్వాత మీ జుట్టును నీళ్లతో కడగాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. కొంత మంది చర్మంపై ఇలాంటివి అప్లై చేసిన సమయంలో అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఉపయోగించే సమయంలో ముందుగా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..