ఖరీదైన క్రీములు వద్దు.. ఈ పండు గుజ్జుతో ఫేస్‌ప్యాక్ చేసి రాసుకుంటే..చర్మం మిళమిళ మెరవాల్సిందే
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. అయితే కొన్ని అత్యవసర పనుల కారణంగా బయటకు వెళ్లడం తప్పట్లేదు. కానీ ఇలా వెళ్లి అలా వచ్చేలోపే ముఖం మొత్తం నల్లగా మారిపోతుంది. ఇలా వేసవిలో మాడిన చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు జనాలు బయటదొరికే బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతారు. కానీ సమ్మర్‌లో విరివిగా దొరికే మామిడి పండుతో కూడా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలంలో ఎండలు, చెమట వల్ల ముఖం సహజమైన కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యను అదిగమించేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లతో కూడా అందమైన మెరిసే చర్మాన్ని పొందచ్చని చాలా మందికి తెలియదు. మామిడి పండులో ఉండే విటమిన్ A, C, E యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, మంచి మెరుపును ఇస్తాయి. మీ చర్మ తత్వాన్ని బట్టి మామిడి పండు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
పొడి చర్మం కోసం మామిడి ఫేస్ ప్యాక్
అయితే చర్మ రకాన్ని బట్టి మామిడి పండు ఫేస్ ప్యాక్‌ను మనం తయారు చేసుకోవాలసి ఉంటుంది. ఒక వేళ మీ చర్మం పొడిగా, పగుళ్లు ఇచ్చినట్లు ఉంటే ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు మనకు 2 చెంచాల మామిడి పండు గుజ్జు, 1 చెంచా తేనె, 1 చెంచా పెరుగు ఉంటే సరిపోతుంది. అయితే వీటితో ఫేస్ ప్యాక్ తయారు చేసేందుకు ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని వీటన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్‌లా చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్నిముఖం, మెడకు పట్టించి 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఇది చర్మానికి తేమను అందించి, మృదువుగా చేస్తుంది. దీని వల్ల చర్మం కూడా మెరుస్తూ కనిపిస్తుంది.
జిడ్డు చర్మం కోసం మామిడి ఫేస్ ప్యాక్
మీ ముఖంపై ఉన్న జిడ్డును తగ్గించి ముఖం తాజాగా కనిపించేలా చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మామిడి పండు ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు మనకు మామిడి పండు గుజ్జు, 1 చెంచా శనగపిండి, కొద్దిగా రోజ్ వాటర్ ఉంటే సరిపోతుంది. తొలుత ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త మామిడి గుజ్జు, శనగపిండి, కొద్దిగా రోజ్‌వాటర్ వేసి బాగా కలపండి. దాన్ని పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇప్పుడు ముఖాన్ని శుభ్రంగా కడుకొన్ని ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. ఇది ముఖంపై పేరుకుపోయిన అధిక జిడ్డును తొలగిస్తుంది. అలాగే ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
ట్యానింగ్ తొలగించే ఫేస్‌ప్యాక్
బయట ఎండలు మండిపోతున్నాయి. మనం కాసేపు బయటకు వెళ్లినా ఎండ వల్ల ముఖం నల్లగా మారుతుంది. ఇలా నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఈ మ్యాంగో ఫేస్ ప్యాక్ సూపర్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం మామిడి పండు గుజ్జు, కొద్దిగా నిమ్మరసం, పెరుగును తీసుకొని ఒక బౌల్‌లో వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం ఒక పేస్ట్‌లా తయారైన తర్వాత దాన్ని ముఖానికి రాసుకొండి. కాసేపు ఉంచి కడిగేయండి. నిమ్మరసం, మామిడిలోని గుణాలు చర్మ రంగును మెరుగుపరిచి, ట్యాన్‌ను తొలగిస్తాయి. దీని వల్ల మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ వాడే ముందు ఇవి తెలుసుకోండి
ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ముఖానికి పెట్టుకున్న ప్యాక్ కడిగేసిన తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే, ముఖానికి రాసే ముందు చేతి మీద కొద్దిగా రాసి పరీక్షించుకోండి.
Note: పైన పేర్కొన్నే అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
