AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!

మీకు పజిల్ గేమ్స్ అంటే ఇష్టమా.. మీరు ఎప్పుడూ కొత్త సమస్యలను సాల్వ్ చేయాలనుకుంటున్నారా?.. మీ తెలివితేటలను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సూపర్ ఛాన్స్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసి మీ తెలివితేటలను పెంచుకునేందుకు ప్రయత్నించండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
Optical Illusion
Anand T
|

Updated on: Aug 13, 2026 | 1:00 PM

Share

ఇంటర్నెట్‌లో రోజూ అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్ వంటి చిత్రాలే ఎక్కువగా జనాలను ఆకర్షిస్తుంటాయి. ఎందుకంటే ఈ చిత్రాలు జనాల బ్రెయిన్‌కు, కళ్లకు పని చెప్పడంతో పాటు తెలివితేటలను పెంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది టైం దొరికినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు.

ఈ చిక్కులను పరిష్కరించే క్రమంలో జరిగే ప్రాసెస్ మీ బ్రెయిన్‌లోని కణాలను యాక్టివ్‌గా పనిచేసేలా చేస్తుంది. చిక్కుముడులను విప్పేందుకు మీ బ్రెయిన్ కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంది. ఈ ప్రక్రియ మీకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేయడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్.

వైరల్ చిత్రంలో ఏముంది?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో మీకు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండపై అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు, చిన్న చిన్న మొక్కలు కూడా కనిపిస్తాయి. కానీ అదే కొండపై ఒక గొర్రె కూడా ఉందని మీకు తెలుసా? అవును ఆ బండరాళ్ల మధ్యలోనే ఒక గొర్రె దాక్కొని ఉంది.. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. 10 సెకన్లలో ఆ గొర్రెను మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు మీరు సిద్ధమైతే.. మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

గొర్రె కనిపించిందా?

ఇచ్చిన నిర్ణీత సమయంలో మీరు ఈ కొండపై ఉన్న గొర్రెను కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్.. మీ కళ్లు చాలా షార్ప్‌గా పనిచేస్తున్నాయని అర్థం. ఒకవేళ మీరు దాన్ని కనిపెట్టలేకపోయినా ఏం పర్వాలేదు.. మేం ఆ గొర్రె ఉన్న చోటును రెడ్ సర్కిల్‌తో రౌండప్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు.

Optical Illusion Test

Optical Illusion Test

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us