AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam: ఈ ఒంగోలు వృషభరాజం ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టకమానరు..

కోట్ల రూపాయల విలువైన కార్ల గురించి విన్నాం… కానీ కోటి రూపాయల ధర పలికే ఒంగోలు జాతి గిత్త అరుదైన విశేషంగా నిలిచింది. సూర్యాపేటకు చెందిన రైతు సురేందర్ రెడ్డి పెంచుతున్న ఈ వృషభరాజం తన బలం, అందం, పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందింది.

Prakasam: ఈ ఒంగోలు వృషభరాజం ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టకమానరు..
Ongole Breed Bull
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 27, 2026 | 7:59 PM

Share

కోట్ల రూపాయల ధర పలికే కార్లు, వాహనాలు చూశాం. అయితే ఓ వృషభరాజం కోటి రూపాయల ధర పలకడం ఎక్కడైనా విన్నారా… ఇదిగో ఇక్కడ ఓ ఒంగోలు జాతి గిత్త ఖరీదు అక్షరాల కోటి రూపాయలుగా ఉందట… దీన్ని కొనేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చినా దీన్ని కన్నబిడ్డలా సాకుతున్న రైతులు మాత్రం దాన్ని అమ్మేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.  కొండను పిండిచేసే బలం, ఆకట్టుకునే చక్కని రూపం, తెలివితేటలు, సమర్ధంగా పనిచేసే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా వీటి ధర నిర్ణయిస్తారట… కోటి రూపాయల ధర పలికే ఒంగోలు జాతి ఎద్దు కలిగిన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన సురేంద్ర రెడ్డి ఈ వివరాలు తెలిపారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొనేందుకు వీటిని తీసుకొచ్చారు… పౌరుషానికి, బలానికి మారుపేరైన ఒంగోలు గిత్తలు సహజంగానే బలంగా ఉంటాయి… వీటికి క్రమం తప్పుకుండా వ్యాయామం చేయించడంతో పాటు పౌష్టికమైన ఆహారం ఉలవలు, బార్లీ గింజలు, క్యారెట్, బీట్రూట్ వంటి బలవర్ధక ఆహారం ఇచ్చి పోషిస్తే మరింత దృఢమైన శరీరాకృతి వస్తుందట… చాలా కాలంగా వీటిని పెంచి పోషిస్తున్న సురేందర్‌రెడ్డి ఎక్కడ ఒంగోలు జాతి గిత్తల పోటీలు ఉన్నా, అక్కడకు వెళ్ళి పోటీల్లో పాల్గొంటుంటారు. ఇప్పటికే ఎన్నో బహుమతులు సాధించారు.

పోటీల్లో ప్రథమ బహుమతి బుల్లెట్‌ బండి…

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకటరావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో  జాతీయస్థాయి ఒంగోలు జాతి సీనియర్‌ విభాగం ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు…. సీనియర్స్‌ విభాగంలో 2200 కిలోల బరువును 25 నిమిషాల వ్యవధిలో లాగేందుకు నిర్వహించిన బలప్రదర్శన పోటీలలో 14 జతల గిత్తలు పాల్గొన్నాయి… పోటీల్లో పాల్గొని ప్రధమంగా నిలిచిన ఎడ్ల యజమానికి బుల్లెంట్‌ బండి బహుమతిగా ఇవ్వనున్నారు.

దట్టమైన ముళ్ల పొదల నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా.. 

Follow Us