AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunchbox : ఎండాకాలంలో ఈ ఆహారాలు అస్సలు లంచ్‌బాక్స్‌లో తీసుకెళ్లకండి.. ఎందుకంటే?

బయట ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో చాలా మంది ఫేస్ చేసే ప్రధాన సమస్య ఏమిటంటే.. లంచ్‌బాక్స్‌లో పెట్టుకెళ్లిన ఆహారం త్వరగా పాడవడం. ఎంతో ఇష్టంగా తిందామని బాక్స్‌లో పెట్టుకెళ్లిన కూరలు బయట ఎండల కారణంగా మధ్యాహ్నం వరకే బ్యాడ్ స్మెల్‌ వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం టిఫిన్ బాక్స్‌లో పెరిగే తేమ, ఉష్ణోగ్రత. వీటివల్లే బాక్టీరియా వేగంగా వృద్ధి చెంది ఆహారం పాడవుతుంది. కాబట్టి సమ్మర్‌లో ఏ ఫుడ్స్‌ను లంచ్‌ బాక్స్‌లో తీసుకెళ్లకూడదో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 27, 2026 | 6:51 PM

Share
కొబ్బరి పచ్చడి: సాధారణంగా అయితే కొబ్బరి పచ్చడిని మనం చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకొని తింటాం. కానీ వేసవిలో మాత్రం కొబ్బరి పచ్చడి చాలా త్వరగా పాడవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే తేమ వల్ల కేవలం కొన్ని గంటల్లోనే ఇది పులిసిపోయి, పాచి వాసన వస్తుంది. కాబట్టి సమ్మర్‌లో ఎప్పుడూ ఈ పచ్చడిని టిఫిన్ బాక్స్‌లో పెట్టుకెళ్లకండి

1 / 5
పెరుగు అన్నం: సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌ ఉంచడంలో పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది సమ్మర్‌లో పెరుగును ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. అయితే పెరుగు అన్నం ఒంటికి చలువ చేసినప్పటికీ, దీన్ని లంచ్‌ బాక్స్‌లో పెట్టుకెళ్తే పాడైపోయే ప్రమాదం ఉంది. ఎండవేడికి పెరుగు త్వరగా పులిసిపోతుంది దీనివల్ల మధ్యాహ్నానికి అన్నం జిగటగా మారి రుచి కోల్పోతుంది. అలాగే స్మెల్‌ కూడా వస్తుంది.

2 / 5
కొబ్బరితో చేసిన వంటకాలు: సాధారణంగా మనం కొన్ని కూరల్లో కొబ్బరి పొడిని ఉపయోగిస్తూ ఉంటాయి. అయితే సమ్మర్‌లో మీరు కొబ్బరి పొడితో చేసిన కూరలను లంచ్‌బాక్స్‌లో తీసుకెళ్లకండి. ఎందుకంటే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం లేదా ఉప్మా వంటి వంటకాలు ఎండకాలంలో ఎక్కువ సేపు నిల్వ ఉండవు. కొబ్బరి త్వరగా పాడై ఆహారం తినడానికి వీలు లేకుండా మారుతుంది. కాబట్టి వీలైనంత వరకు కొబ్బరితో చేసిన వంటకాలను అవైడ్ చేయండి.

3 / 5
పూరీ, ఆలుగడ్డ కూర: కొందరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేసిన ఆహారాన్నే మధ్యహ్నం కూడా తినేందుకు బాక్స్‌లో తీసుకెళ్తారు. అలాంటి వాటీలో పూరి కూడా ఒకటి. పూరీలోని తేమ వల్ల అది మెత్తగా, జిగటగా మారుతుంది. అలాగే ఆలుగడ్డ కూరలో ఉండే తేమ, ఉల్లిపాయల వల్ల అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా సమ్మర్లో లంచ్‌ బాక్స్‌లో తీసుకెళ్లకండి

4 / 5
గుడ్డు వంటకాలు: ఎగ్ రోల్స్ లేదా ఎగ్ శాండ్‌విచ్ వంటి గుడ్డుతో చేసిన పదార్థాలు ఎండలో త్వరగా చెడిపోతాయి. కొన్ని గంటలకే వీటి నుండి దుర్వాసన రావడం మొదలవుతుంది. అలాగే పనీర్ కూడా వేసవిలో త్వరగా పాడయ్యే పదార్థం. ముఖ్యంగా గ్రేవీ లేదా క్రీమ్ ఉపయోగించి చేసిన పనీర్ కూరలు మధ్యాహ్నం వరకు ఉండవు,స్మెల్ వస్తాయి. కాబట్టి వీటిని కూడా లంచ్‌ బాక్స్‌లో తీసుకెళ్లకండి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదిక ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు)

5 / 5
Follow Us