Cucumber Seeds: దోసకాయ గింజలు తింటే ఇన్ని లాభాల..! తెలిస్తే అస్సలు వదులుకోరు

దోసకాయలాగే దీని గింజలు కూడా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది మన శరీరానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. హై బీపీ నుంచి డయాబెటిస్ వరకు అన్నింటికీ ఇది దివ్యౌషధమని చెబుతున్నారు. కీర దోసకాయ గింజలను నేరుగా నమలి తినడం లేదంటే, పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. దోసకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..

Cucumber Seeds: దోసకాయ గింజలు తింటే ఇన్ని లాభాల..! తెలిస్తే అస్సలు వదులుకోరు
Cucumber Seeds
Follow us

|

Updated on: Aug 10, 2024 | 8:01 PM

కీర దోసకాయ అనేది ఔషధ గుణాల నిధి వంటి కూరగాయ. ఇది సలాడ్ నుండి రైతా వరకు ప్రతిదాంట్లోనూ ఉపయోగిస్తారు. అయితే, దోసకాయలాగే దీని గింజలు కూడా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది మన శరీరానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. హై బీపీ నుంచి డయాబెటిస్ వరకు అన్నింటికీ ఇది దివ్యౌషధమని చెబుతున్నారు. కీర దోసకాయ గింజలను నేరుగా నమలి తినడం లేదంటే, పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. దోసకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..

1. జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది:

దోసకాయ గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పీచు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక చెంచా దోసకాయ గింజలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

2. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది:

దోసకాయ గింజలు బరువు తగ్గడానికి గొప్ప మార్గం. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. దాంతో మీరు ఈజీగా బరువు తగ్గగలుతారు. అందుకే దోసకాయ, దాని విత్తనాలను ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

3. మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి:

దోసకాయ గింజలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

4. ఎముకలను బలోపేతం చేస్తుంది:

దోసకాయ గింజల్లో కాల్షియం,ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

5. చర్మ సంరక్షణ :

దోసకాయ గింజలను చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, తాజాగా ఉంచుతాయి. దీని పేస్ట్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల మచ్చలు, ముడతల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

6. నిర్విషీకరణ:

దోసకాయ గింజలు డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

7. మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

దోసకాయ గింజల్లో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

8. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:

దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. కొంత మంది చర్మంపై ఇలాంటివి అప్లై చేసిన సమయంలో అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఉపయోగించే సమయంలో ముందుగా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..