AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుచిగా ఉంటుందని మీరూ ఫ్రైలు ఇలా చేస్తున్నారా? ఈ పొరబాటు గుండెపోటుకు రహదారి..

కూరగాయలతో రుచికరమైన క్రిస్పీ ఫ్రై వంటకాలు చేసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అయితే వంట కోసం మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు వాడుతుంటారు. ఇక కూరలు, వేపుడు వంటి ఆహారాలు తయారు చేసిన తర్వాత అధిక నూనె వినియోగంతోపాటు చివరిలో వాటిపై నెయ్యి కూడా చిలికిస్తారు..

రుచిగా ఉంటుందని మీరూ ఫ్రైలు ఇలా చేస్తున్నారా? ఈ పొరబాటు గుండెపోటుకు రహదారి..
Vegetable Fry
Srilakshmi C
|

Updated on: Jun 03, 2025 | 9:06 PM

Share

చాలా మంది ఇళ్లలో రకరకాల కూరగాయలతో రుచికరమైన క్రిస్పీ ఫ్రై వంటకాలు చేస్తుంటారు. అయితే వంట కోసం మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు వాడుతుంటారు. ఇక కూరలు, వేపుడు వంటి ఆహారాలు తయారు చేసిన తర్వాత అధిక నూనె వినియోగంతోపాటు చివరిలో వాటిపై నెయ్యి కూడా చిలికిస్తారు. అయితే ఈ అలవాటు అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

తరచూ ఇలా వంట నూనెల విషయంలో చేసే పొరబాట్లు శరీరంలో వివిధ సమస్యలకు కారణం అవుతాయట. ముఖ్యంగా గుండె జబ్బుల సమస్యలు అధికమవుతాయని హెచ్చరిస్తున్నారు. కూరగాయలను ఏ నూనెలో వేయించాలో తెలుసుకోవాలి. రుచి కోసం చేసే పొరబాట్లు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నిపుణుల మాటల్లో మీ కోసం.. ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకుండా ఏ నూనె వాడాలి? కూరగాయలను ఎలా వేయించాలి? వంటి విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే.. వంటలో ఆవాల నూనె లేదంటే నువ్వుల నూనెను వినియోగించడం సురక్షితమని చెబుతున్నారు.

ఈ నూనెలు తక్కువ మొత్తంలో ఉపయోగించడం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదు. అయితే కూరగాయలు వేయించేటప్పుడు, వాటిని నెయ్యితో వేయించడానికి ప్రయత్నించాలి. పప్పులను వేయించడానికి కూడా, నూనెకు బదులుగా నెయ్యిని వాడటం మంచిది. ఇది శరీరంలో ఒమేగా 3, ఒమేగా 6 సమతుల్యతను కాపాడుతుంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.