AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరూ మామిడి పండు తిన్నాక టెంక పడేస్తున్నారా? ఆగండాగండీ..

పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. మామిడి పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. కానీ మామిడి పండు తిన్న తర్వాత దాని టెంక మనం పడేస్తుంటాం.. కానీ మీకు తెలుసా? మామిడి విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయట. ఆయుర్వేద నిపుణుల ప్రకారం..

మీరూ మామిడి పండు తిన్నాక టెంక పడేస్తున్నారా? ఆగండాగండీ..
Mango Seed
Srilakshmi C
|

Updated on: Jun 03, 2025 | 9:06 PM

Share

మామిడి పండ్లలో రాజు. పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు. మామిడి పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. కానీ మామిడి పండు తిన్న తర్వాత దాని టెంక మనం పడేస్తుంటాం.. కానీ మీకు తెలుసా? మామిడి విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయట. ఆయుర్వేద నిపుణుల ప్రకారం మామిడి పండు విత్తనాలను ఆరోగ్యానికి ప్రభావవంతమైన మూలికగా భావిస్తున్నారు. ఆరోగ్యానికి ఈ విత్తనాలు ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..

  • మనం సాధారణంగా మామిడి గుజ్జును తినేసి, దాని టెంకను పారేస్తాం. కానీ దాని నుంచి తయారుచేసిన పొడికి చాలా వ్యాధులను నయం చేసే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే వీటిని చెత్తబుట్టలో వేసే ముందు కాస్త ఆలోచించడం మంచిది.
  • మామిడి పండు లోపల ఉండే విత్తనం ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది.
  • మామిడి పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. ఇది మధుమేహంతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
  • మామిడి పొడిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
  • మామిడి పొడిలోని క్రియాశీల సమ్మేళనాలు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫలితంగా కాలేయం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది.
  • మామిడి పొడిలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ ఖనిజాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
  • ఈ పొడి పిల్లలతో పాటు పెద్దల అభివృద్ధికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పొడి శరీరంలో మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
  • కీళ్ల నొప్పులు ఉన్నవారికి మామిడి విత్తనాల పొడి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఈ పొడిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ పొడిలోని ఫైబర్ కంటెంట్ అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • మామిడి పొడి నుంచి తీసిన నూనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది పొడి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులో తేనె లేదా పాలు కలిపి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

మామిడి పొడిని ఎలా తయారు చేయాలంటే?

మామిడి గింజలను ఎండలో బాగా ఎండబెట్టాలి. తరువాత వాటిని మిక్సీలో పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని టీలో కలిపి ప్రతిరోజూ తాగవచ్చు. లేదా స్మూతీలు, జ్యూస్‌లలోనూ చేర్చుకోవచ్చు. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!