Beard: గుబురు గడ్డం పెంచడం కాదు.. దాన్ని మెయింటైన్ చేయడం కూడా తెలియాలి
చెమట వల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే గుబురు గడ్డాలు ఉన్నవారు దురద వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి. అలాగే, మీ గడ్డం నల్లగా, మందంగా పెరగడానికి కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు మసాజ్ చేయండి.

ఇప్పుడు గడ్డం లేని కుర్రాడు బయట కనిపించడం లేదు. పుష్ప, కేజీఎఫ్ సినిమాలు వచ్చిన తర్వాత గడ్డం పెంచడం ఫ్యాషనైపోయింది. సెలబ్రిటీల నుంచి సాధారాణ యువకుల వరకు గడ్డం పెంచి డిఫరెంట్ లుక్కులో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా గడ్డం ఉంటే ఆ లుక్కే వేరు అంతే. అమ్మాయిలు కూడా బియర్డ్ ఉన్న అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అందంగా కనిపించే ఈ గడ్డాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. గుబురు గడ్డం పెరిగితే చెమట, దురద చికాకు కలిగిస్తాయి. అంతే కాకుండా చెమట వల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే గుబురు గడ్డాలు ఉన్నవారు దురద వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
గడ్డంలో దురదను నివారించడానికి స్నానం చేసే ముందు మీ గడ్డాన్ని నూనెతో మసాజ్ చేయండి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయడం మంచిది. మీ చర్మ రకాన్ని బట్టి మంచి క్లెన్సర్‌ని ఉపయోగించడం కూడా అవసరం. అలానే స్నానం చేసేటప్పుడు మీ గడ్డాన్ని బాగా క్లీన్ చేసుకోవడం ద్వారా బ్యాక్టీరియాకు చెక్ పెట్టవచ్చు. దీని కోసం మంచి కండీషనర్‌ని వాడితే బటర్. తర్వాత మంచి ఔషదం రాయండి. ఇలా చేయడం వల్ల దురద రాదు. అలాగే, మీ గడ్డం నల్లగా, మందంగా పెరగడానికి కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు మసాజ్ చేయండి. ఇది మీ చర్మ ఆరోగ్యానికి, గడ్డం పెరగడానికి సహాయపడుతుంది.
పోషకాలు ఎక్కువగా ఉండే మంచి ఫుడ్ తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి నిద్ర, స్మోకింగ్ మానేయడం ద్వారా గుబురు గడ్డాన్ని పొందవచ్చు. అయితే మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్ వాళ్లకు గడ్డం రాకపోతే.. జీన్స్ వల్ల మీకు కూడా గడ్డం పెంచే అవకాశం ఉండదు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
