Tomato Masala Curry: టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
హోటల్ స్టైల్లో చేసే టమాటా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎందులోకైనా అదిరిపోతుంది అంతే. చాలా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా అయిపోతుంది. ఈ కర్రీ వండుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది..
మసాలా కర్రీలు ఎందులోకైనా చాలా రుచిగా ఉంటాయి. బిర్యానీ, పులావ్, బగారా, చపాతీ, పుల్కా, పరోటా, అన్నం ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటాయి. ఇలా హోటల్ స్టైల్లో చేసే టమాటా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎందులోకైనా అదిరిపోతుంది అంతే. చాలా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా అయిపోతుంది. ఈ కర్రీ వండుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇంట్లో ఏవైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు.. పండుగల సమయంలో ఈ కర్రీ ప్రిపేర్ చేయవచ్చు. తిన్నవాళ్లు మీకు ఫ్యాన్స్ అయిపోతారు. మరి ఈ టమాటా మసాలా కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
టమాటా మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, నువ్వులు, పల్లీలు, కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, మిరియాలు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, చింత పండు, ఆయిల్, నెయ్యి.
టమాటా మసాలా కర్రీ తయారీ విధానం:
ముందుగా ఈ కర్రీకి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకు ఒక పాన్ తీసుకుని అందులో వేరు శనగ, నువ్వులు, కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, మిరియాలు ఒక దాని తర్వాత మరొకటి వేసి వేయించాలి. ఆ తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చిన్న సైజ్ టమాటాలను తీసుకుని గుత్తి వంకాయలా గాట్లు పెట్టుకోవచ్చు. ఇష్టం లేని వాళ్లు పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు కర్రీ పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి టమాటాలను ముందుగా ఓ నిమిషం వేయించి తీసుకోవాలి.
ఆ తర్వాత అందులోనే కొద్దిగా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, మిక్సీ పట్టిన పేస్ట్ వేసి చిన్న మంట మీద మాడిపోకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఇవన్నీ వేగాక పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. వీటిని ఓ నిమిషం వేయించిన తర్వాత.. చింత పండు గుజ్జు కూడా వేసి మరిగించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి చిన్న మంట మీద దగ్గర పడేంత వరకు ఇగురు అయ్యేంత వరకు ఉడికించాలి. చివరగా కసూరి మేతి చల్లి.. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టమాటా మసాలా కర్రీ సిద్ధం.