Broccoli Soup: ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలీ సూప్.. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు..

బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. విదేశీయులు ఎక్కువగా ఈ బ్రోకలీనే ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటారు. బ్రోకలీని సలాడ్స్‌‌లో ఎక్కువగా తింటారు. బ్రోకలీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

Broccoli Soup: ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలీ సూప్.. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు..
Broccoli Soup
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 28, 2025 | 9:17 PM

బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రోకలీ కూడా చూసేందుకు క్యాలీ ఫ్లవర్‌లా ఉంటుంది. కానీ పచ్చగా ఉంటుంది. సాధారణంగా లభించే క్యాలీ ఫ్లవర్ కంటే ఇది కాస్త ఖరీదు ఎక్కువ. అలాగే పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. విదేశీయులు ఎక్కువగా ఈ బ్రోకలీనే ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటారు. బ్రోకలీని సలాడ్స్‌‌లో ఎక్కువగా తింటారు. బ్రోకలీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బ్రోకలీతో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ బ్రోకలీ సూప్ ఎలా తయారు చేస్తారు? ఈ సూప్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్రోకలీ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

బటర్, బ్రోకలీ, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, మిరియాల పొడి, ఉప్పు, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి తరుగు, ఫ్రెష్ క్రీమ్.

బ్రోకలీ సూప్ తయారీ విధానం:

సూప్స్‌లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ సూప్‌లో కూడా మీకు నచ్చినవి వేయండి. అన్నీ వేయాలని లేదు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సాస్ తయారు చేసే పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి వేడి వేయండి. బటర్ కరిగాక.. అల్లం వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బ్రోకలీ, కట్ చేసిన వెజిటేబుల్స్ వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగాక నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగాక.. ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, వాటర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని సూప్‌లో వేసి చిన్న మంట మీద చిక్కబడేంత వరకు ఉడికించాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బ్రోకలీ సూప్ సిద్ధం. ఈ సూప్ తాగడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.