AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..? వెంటనే ఇవి మార్చుకోకపోతే..

సంతానలేమి సమస్య అనగానే ఇప్పటివరకు చాలామంది కేవలం మహిళల్లో ఉండే లోపాల గురించే మాట్లాడుకునేవారు. కానీ వైద్యుల సర్వేల ప్రకారం ఇప్పుడు పురుషులలో కూడా శుక్రకణాల కొరత అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. అసలు శుక్రకణాల సంఖ్య ఎంత ఉండాలి? చాలా మంది పురుషులు తమకు తెలియకుండానే చేస్తున్న చిన్న చిన్న తప్పులు వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో తెలుసుకుందాం..

మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..? వెంటనే ఇవి మార్చుకోకపోతే..
How To Improve Sperm Count Naturally
Krishna S
|

Updated on: Jul 04, 2026 | 8:10 AM

Share

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ సమస్య కేవలం మహిళల్లోనే ఉంటుందనే అపోహ ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు పురుషులలో కూడా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడంపై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా వీర్యంలో శుక్రకణాల సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉండటం ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారుతోంది. ప్రముఖ అంతర్జాతీయ హెల్త్ వెబ్‌సైట్ మేయోక్లినిక్ ప్రకారం.. ఒక మిల్లీలీటర్ వీర్యంలో 1.5 కోట్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటే దానిని తక్కువ శుక్రకణాల సంఖ్య లేదా ఒలిగోస్పెర్మియా అంటారు. ఒకవేళ వీర్యంలో శుక్రకణాలు అస్సలు లేకపోతే.. ఆ పరిస్థితిని అజూస్పెర్మియా అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భాగస్వామి సహజంగా గర్భం దాల్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

కనిపించే ప్రధాన సంకేతాలు – లక్షణాలు

ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు వాడకుండా, ఎంత ప్రయత్నించినప్పటికీ గర్భం ధరించలేకపోవడం అనేది తక్కువ వీర్య కణాల సంఖ్యకు మొదటి, ప్రధాన సంకేతం. అయితే చాలా మందిలో ఎలాంటి స్పష్టమైన బాహ్య లక్షణాలు కనిపించవు. కొంతమంది పురుషులలో హార్మోన్ల అసమతుల్యత లేదా శారీరక లోపాల వల్ల.. లైంగిక కోరిక లేకపోవడం, అంగస్తంభన లోపాలు, వృషణాలలో నొప్పి, వాపు లేదా చిన్నపాటి గడ్డలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

శుక్రకణాల సంఖ్య తగ్గడానికి దారితీసే కారణాలు

పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడానికి కేవలం ఒకే కారణం ఉండదు. నిపుణుల ప్రకారం కింది అంశాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

జీవనశైలి లోపాలు: ధూమపానం, పొగాకు నమలడం, అధికంగా మద్యం సేవించడం, మాదకద్రవ్యాల వాడకం.

ఆరోగ్య సమస్యలు: ఊబకాయం, నిరంతర మానసిక ఒత్తిడి, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత.

వైద్యపరమైన కారణాలు: వృషణాల్లో సిరలు ఉబ్బిపోయే వరికోసెల్ వ్యాధి, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, కొన్ని మందులను దీర్ఘకాలం పాటు వాడటం.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

సాధారణంగా పెళ్లయిన తర్వాత ఎలాంటి గర్భనిరోధకాలు ఉపయోగించకుండా, ఒక సంవత్సరం పాటు క్రమబద్ధంగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ సంతానం కలగకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గతంలో వృషణాలకు సంబంధించిన సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు లేదా లైంగిక ఆరోగ్య సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్నవారు ఆలస్యం చేయకుండా ముందే పరీక్ష చేయించుకోవడం మంచిది. సరైన సమయంలో సమస్యను గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది.

నివారణ – చికిత్స సాధ్యమేనా?

వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నంత మాత్రాన అది శాశ్వత వంధ్యత్వం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేటి ఆధునిక వైద్యశాస్త్రంలో దీనికి చక్కని పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల మందులు, హార్మోన్ థెరపీలు, ఆధునిక సంతానోత్పత్తి చికిత్సల ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచవచ్చు. దీంతో పాటు రోజూ సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పుల ద్వారా శుక్రకణాల సంఖ్యను, వాటి నాణ్యతను సహజంగానే పెంచుకోవచ్చు.

Follow Us
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?
ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా పై ఈజిప్ట్ చారిత్రాత్మక విజయం
ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా పై ఈజిప్ట్ చారిత్రాత్మక విజయం
మీ సిబిల్ రిపోర్టులో ఈ పదం ఉందా..? జాగ్రత్త పడకపోతే..
మీ సిబిల్ రిపోర్టులో ఈ పదం ఉందా..? జాగ్రత్త పడకపోతే..
బ్లాక్ బస్టర్‌ తరువాత లాంగ్ గ్యాప్‌... ఏం ప్లాన్ చేస్తున్నారు?
బ్లాక్ బస్టర్‌ తరువాత లాంగ్ గ్యాప్‌... ఏం ప్లాన్ చేస్తున్నారు?
స్టార్ హీరో ఇంట్లో దొంగతనం..డ్రైవర్ అరెస్ట్..
స్టార్ హీరో ఇంట్లో దొంగతనం..డ్రైవర్ అరెస్ట్..
రోహిత్ శర్మ రికార్డును అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనా?
రోహిత్ శర్మ రికార్డును అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనా?
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్.. నలుగురు అరెస్ట్‌
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్.. నలుగురు అరెస్ట్‌
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!