AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Report: మీ క్రెడిట్ రిపోర్టులో ఈ పదం ఉందా..? ఇది మీకో హెచ్చరిక.. జాగ్రత్త పడకపోతే ఇబ్బందే..

ప్రతీఒక్కరికీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. సిబిల్ స్కోర్ నిర్ణీత పరిమితికి మంచి ఉండకపోతే ఏ బ్యాంక్ కూడా మీకు లోన్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తాయి. అయితే మీ క్రెడిట్ స్కోర్‌లో ఈ పదం ఉంటే జాగ్రత్త పడండి.

Credit Report: మీ క్రెడిట్ రిపోర్టులో ఈ పదం ఉందా..? ఇది మీకో హెచ్చరిక.. జాగ్రత్త పడకపోతే ఇబ్బందే..
How To Improve Credit Score Fast
Venkatrao Lella
|

Updated on: Jul 04, 2026 | 8:00 AM

Share

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల క్రమంలో క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటాం. అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌స్టంట్ లోన్ వంటివి తీసుకోవచ్చు. అయితే మీరు అత్యవసర సమయంలో నిధుల కోసం లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. లేకపోతే మీకు ఏ బ్యాంక్, ఆర్ధిక సంస్థలు రుణాలు మంజూరు చేయవు. అందుకే క్రెడిట్ స్కోర్‌ను మెరుగ్గా ఉంచుకోవాలి. 750పైన ఉండటం వల్ల మీకు రుణాలు, క్రెడిట్ కార్డులు త్వరగా మంజూరవుతాయి. ఇక క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వివరాలు తప్పుగా ఉంటే సరిదిద్దుకోవాలి.

క్రెడిట్ రిపోర్టులో “రిటన్ ఆఫ్” అని ఉందా..?

ఇక మీ క్రెడిట్ రిపోర్టులో ” Written Off ” అనే పదం ఉందా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. రిటన్ ఆఫ్ అంటే మీ రుణం రద్దు లేదా మాఫీ చేసినట్లు అర్థం కాదు. మీరు రుణం చెల్లించలేని పక్షంలో.. కస్టమర్ చెల్లించడం అసాధ్యమని బ్యాంక్ నమ్మిన సందర్భాలో ఆ అకౌంట్‌ను రికార్డుల్లో నష్టంగా చూపించి తాత్కాలికంగా మూసివేస్తారు. దీనినే ‘Written Off’ అని అంటారు. బ్యాంకు తన రికార్డుల్లో దీనిని నష్టంగా చూపిస్తుంది. మిమ్మల్ని డీఫాల్టర్‌గా పరిగణిస్తారు. దీని వల్ల వమీ క్రెడిట్ స్కోర్ దారుణంగా దెబ్బతింటుంది. మీరు ఆరు నెలల పాటు ఈఎంఐ చెల్లించకపోతే డీఫాల్టర్‌గా పరిగణిస్తారు. మీపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవచ్చు. దీంతో మీ క్రెడిట్ రిపోర్టులో ఈ పదం ఉంటే వెంటనే జాగ్రత్త పడింది. వెంటనే బకాయిలు చెల్లించండి. లేకపోతే మీకు భవిష్యత్తులో రుణాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

మీరు ఏం చేయాలి..?

-బ్యాంక్‌కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి లోన్ అకౌంట్ క్లోజ్ చేయాలి

-మీరు లోన్ చెల్లించాక వారం రోజుల తర్వాత మీ క్రెడిట్ స్కోర్‌లో అప్డేట్ అవుతుంది.

-మీ క్రెడిట్ రిపోర్టులో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది

-మీరు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తే క్రెడిట్ హిస్టరీని కాపాడుకోవచ్చు.

Follow Us
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే