AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : రోహిత్ శర్మ రికార్డును అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనా? దరిదాపుల్లో లేని మిగతా స్టార్ బ్యాటర్లు

Rohit Sharma : టీ20 క్రికెట్‌లో 568 సిక్సర్లతో రోహిత్ శర్మ నెలకొల్పిన అరుదైన రికార్డు ఇప్పటికీ అజేయంగా నిలిచింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, సంజూ శాంసన్ లాంటి భారత స్టార్ బ్యాటర్లు కూడా ఈ మైలురాయికి చాలా దూరంలోనే ఉన్నారు.

Rohit Sharma : రోహిత్ శర్మ రికార్డును అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనా? దరిదాపుల్లో లేని మిగతా స్టార్ బ్యాటర్లు
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 04, 2026 | 7:52 AM

Share

Rohit Sharma : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‎కు గుడ్‌బై చెప్పేసినా ఆయన సృష్టించిన రికార్డులు మాత్రం ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. బార్బడోస్ వేదికగా జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మహామహులైన ఆటగాళ్లు ఆటకు దూరమైనా వారు సృష్టించే ఇంపాక్ట్ అలాగే ఉండిపోతుంది. రోహిత్ శర్మ విషయంలోనూ ఇది అక్షరాలా నిజం. రోహిత్ కెరీర్‌లో నమోదైన ఒక అరుదైన మైలురాయి రాబోయే ఎన్నో సంవత్సరాల వరకు మరొకరి పేరు మీదకు మారడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

టీ20 చరిత్రలో హిట్‌మ్యాన్ ప్రభంజనం

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించడమే కాకుండా, మొత్తంగా ఓవరాల్ టీ20 క్రికెట్ ఫార్మాట్‌లోనూ అత్యధిక సిక్సర్లు బాదిన కింగ్‌గా నిలిచాడు. మైదానంలోకి దిగితే సిక్సర్ల వర్షం కురిపించే రోహిత్ శర్మ, ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో ఏకంగా 568 సిక్సర్లు బాదాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 500 సిక్సర్ల మార్కును దాటిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా రోహిత్ శర్మ పేరిట ఈ అజేయమైన రికార్డు లిఖించబడింది.

హిట్‌మ్యాన్ కంటే 108 సిక్సర్లు వెనుకబడిన విరాట్ కోహ్లీ

భారత బ్యాటర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే, రోహిత్ శర్మ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సైతం ఈ విషయంలో రోహిత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ తన ఓవరాల్ టీ20 కెరీర్‌లో 460 సిక్సర్లు కొట్టాడు. అంటే హిట్‌మ్యాన్ కంటే కోహ్లీ ఏకంగా 108 సిక్సర్లు వెనుకబడి ఉన్నాడన్నమాట. దీనిబట్టి టీ20ల్లో రోహిత్ శర్మ సిక్సర్ల రేంజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

మూడు, నాలుగు స్థానాల్లో సూర్యకుమార్, సంజూ శాంసన్

రోహిత్, విరాట్ తర్వాత ఈ జాబితాలో టీమ్ ఇండియా ప్రస్తుత స్టార్ ఆటగాళ్లు నిలిచారు. భారత మాజీ కెప్టెన్, మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 429 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 420 సిక్సర్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్‌లో 400 సిక్సర్ల మైలురాయిని తాకిన ఆటగాళ్లు ఈ నలుగురు మాత్రమే కావడం విశేషం. మిగిలిన ఏ ఇతర భారతీయ బ్యాటర్ కూడా ఇప్పటివరకు 400 సిక్సర్ల మార్కును అందుకోలేకపోయారు.

విరాట్ కోహ్లీ రికార్డుకు కొద్దిగా వెనుకబడిన రోహిత్ శర్మ

సిక్సర్ల రికార్డు పక్కన పెడితే, ఓవరాల్ టీ20ల్లో పరుగులు సాధించడంలోనూ రోహిత్ శర్మ అగ్రశ్రేణిలోనే ఉన్నాడు. రోహిత్ శర్మ తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 472 మ్యాచ్‌లు ఆడి మొత్తం 12,531 పరుగులు సాధించాడు. భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ పరుగుల వేటలో కింగ్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 14,218 పరుగులు ఉన్నాయి. టీ20 క్రికెట్‌కు విరాట్, రోహిత్ జోడి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
100 కిలోల కుండను తాకకుండా కదిలించాలి.. ఎలా? చిక్కుప్రశ్న
100 కిలోల కుండను తాకకుండా కదిలించాలి.. ఎలా? చిక్కుప్రశ్న
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?