AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరగడుపున ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చాలామంది ఉదయాన్నే శక్తి కోసం ఖాళీ కడుపుతో ఖర్జూరాలను తింటుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరగడుపున ఖర్జూరం తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 04, 2026 | 7:16 AM

Share
ఖర్జూరాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరగడుపున వీటిని తినడం వల్ల ఉదయాన్నే శరీరం అలసటకు గురవుతుంది. అంతేకాకుండా, ఈ అలవాటు దీర్ఘకాలంలో ఊబకాయం, గుండె జబ్బులు మరియు డయాబెటిస్ (మధుమేహం) వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

1 / 5
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, అలసట: ఖర్జూరాలలో సహజ సిద్ధమైన చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్) అధిక మొత్తంలో ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తిన్నప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. దీనివల్ల క్షణాల్లో ఎనర్జీ వచ్చినట్లు అనిపించినప్పటికీ, ఆ తర్వాత అంతే వేగంగా షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ఫలితంగా రోజంతా నీరసం, తీవ్రమైన అలసట వచ్చే ప్రమాదం ఉంది.

2 / 5
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ముప్పు: పరగడుపున క్రమం తప్పకుండా ఖర్జూరాలు తినడం వల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా, శరీర బరువు వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కాలక్రమేణా ఊబకాయం (Obesity), గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. జీర్ణక్రియపై కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

3 / 5
అందుకని, ఖర్జూరాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ, వాటిని తినే సమయంలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామానికి ముందు (Pre-Workout): మీరు జిమ్‌కు లేదా రన్నింగ్‌కు వెళ్లే ముందు 2 లేదా 3 ఖర్జూరాలు తింటే, అవి శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు అలసట రాకుండా కాపాడతాయి.

4 / 5
అలాగే, రాత్రి నిద్రపోయే ముందు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తినడం వల్ల ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఖర్జూరాలను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోండి.

5 / 5
Follow Us