AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం! ఎలాగంటే..

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం.. ఇప్పటి వరకు భక్తుల గమ్యస్థానంగానే ఉంది. ఇకపై పర్యాటకులకు కూడా హాట్ డెస్టినేషన్‌గా మారబోతోంది. ఆలయ దర్శనంతో పాటు చరిత్ర, సంస్కృతి, హస్తకళలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఒకే రోజులో చూపించే వినూత్న టూరిజం ప్యాకేజీని తెలంగాణ టూరిజం తీసుకొచ్చింది. దీంతో యాదాద్రి జిల్లా పర్యాటక మ్యాప్‌పై మరింత బలంగా నిలవబోతోంది.

యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం! ఎలాగంటే..
Yadadri Tour Package
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 7:37 AM

Share

యాదగిరి గుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పునర్ నిర్మించింది. పూర్తిగా కృష్ణ శిలలతో, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం, నిపుణులైన స్తపతులతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ప్రతి రోజు వేలాది మంది, పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ రద్దీని పర్యాటకాభివృద్ధికి అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది.

యాదాద్రి జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమైన ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణ టూరిజం శాఖ భక్తులు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ ని తీసుకువచ్చింది. ఇప్పటి వరకు యాదాద్రికి వచ్చిన భక్తులు దర్శనం ముగిసిన వెంటనే వెనుదిరిగేవారు. ఇప్పుడు భక్తులు వారసత్వ ప్రదేశాలపై ఆసక్తి కలిగిన పర్యాటకు అదే ప్రయాణంలో చారిత్రక కోటలు, పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక చారిత్రక, చేనేత వైభవాన్ని ప్రతిబింబించే ప్రాంతాలను ఒక్కరోజులో ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.

తెలంగాణ టూరిజం శాఖ ఒకే రోజు 5 ప్రధాన ప్రాంతాలైన ‘హైదరాబాద్ – యాదగిరిగుట్ట -శిల్పారామం- కొలనుపాక జైన దేవాలయం- స్వర్ణగిరి దేవాలయం-పోచంపల్లి – హైదరాబాద్ పేరుతో నూతనంగా ఒకరోజు పుణ్యక్షేత్ర- వారసత్వ పర్యాటక ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్రాంతాలను ఒకే ట్రిప్‌లో సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. ఒక రోజు టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమై హైదరాబాద్ తో ముగుస్తుంది. ప్రయాణికులు యాత్రి నివాస్, సికింద్రాబాద్ వద్ద ఉదయం 7 గంటలకు, పర్యాటక భవన్, బేగంపేట్ వద్ద ఉదయం 7:15 గంటలకు, సీఆర్డీఓ కార్యాలయం, బషీర్ బాగ్ వద్ద ఉదయం 7:30 గంటలకు బస్సు బయలు దేరుతుంది.

ఇవి కూడా చదవండి

పర్యాటక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు..

ఈ ప్యాకేజీలో హైదరాబాదు నుండి ఏడున్నర గంటలకు బయలుదేరే బస్సు మొదటగా భక్తులు, పర్యాటకులు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారినీ దర్శించుకుంటారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట లోని టూరిజం హరిత హోటల్ అల్పాహారం అందిస్తారు. యాదగిరిగుట్టలోని తెలంగాణ గ్రామీణ కళలు, చేతి వృత్తులు, సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే రాయిగిరి చెరువు వద్ద ఉన్న శిల్పారామంను సందర్శిస్తారు. అనంతరం దక్షిణ భారత దేశంలోని అత్యంత ప్రాచీన, కొలనుపాక జైన దేవాలయాన్ని దర్శిస్తారు. అక్కడి నుంచి భువనగిరిలో మధ్యాహ్నం శాఖాహార భోజనం అందిస్తారు. అక్కడి నుంచి భక్తులు స్వర్ణగిరి దేవాలయం సందర్శిస్తారు. పర్య టనలో చివరిగా ఖాండాంతర ఖ్యాతిని అర్జించిన ఇక్కత్ చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిని సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న హరిత హోటల్లో హై- టీ ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.

ప్యాకేజీ వివరాలు..

ఈ ప్యాకేజీ సదుపాయాన్ని వినియోగించుకోవాలనే భక్తులు, పర్యాటకుల కోసం టూరిజం శాఖ పెద్దలకు రూ.2,070 పిల్లలకు రూ. 1,770 గెట్ ధరలుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీ వివరాల కోసం బషీర్ బాగ్ లోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సీఆర్డీఓ) సెల్ నంబర్లు 9848125720, 83672 85285 సంప్రదించాలి. ఇంకేముంది వెంటనే తమ టికెట్లను బుక్ చేసుకొని ఆలయ దర్శనంతో పాటు చరిత్ర, సంస్కృతి, హస్తకళలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వైభవాన్ని ఆస్వాదించండి.

యాదాద్రి అంటే ఇప్పటివరకు కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే. ఇకపై భక్తి, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం… అన్నింటినీ ఒకే చోట కలిపే టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్యాకేజీ విజయవంతమైతే.. యాదాద్రి కేవలం ఆలయ నగరి కాదు… తెలంగాణ టూరిజం ముఖచిత్రంగా నిలువబోతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us