AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: తులసి మొక్క విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! ఇంటిని దురదృష్టం వెంటాడుతుంది..!

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తులసి మొక్క విషయంలో కొన్ని తప్పుల వల్ల ఇంటికి దురదృష్టం వస్తుందట. తులసి మొక్కను ఎలా పెంచాలి..? ఇంట్లో అదృష్టాన్ని ఎలా తీసుకురావాలి..? ఈ విషయాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips: తులసి మొక్క విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! ఇంటిని దురదృష్టం వెంటాడుతుంది..!
Tulsi Plant Vastu
Prashanthi V
|

Updated on: Feb 16, 2025 | 1:01 PM

Share

తులసి మొక్క హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది. దీనిని దేవతల ఆరాధనలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఆరోగ్య పరంగా కూడా తులసికి గొప్ప ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఔషధగుణాలు ఉన్న మహామూలికగా గుర్తించారు.

ఎక్కువ మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ప్రేమతో పెంచుతారు. అయితే కాలానుగుణ మార్పుల వల్ల ఇది ఎండిపోవడం, వాడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి, చలికాలంలో తులసి మొక్క కాస్త బలహీనంగా మారుతుంది. అయితే దీన్ని సరైన విధంగా చూసుకుంటే ఇంట్లో శుభఫలితాలు రావచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

తులసి మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు దాని స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తగిన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను పచ్చగా, ఆరోగ్యంగా ఉంచితే కుటుంబ సభ్యుల జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని అంటారు.

తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి..?

తులసి మొక్కను ఇంటి ముందువైపున, మద్యంలో లేదా ఉత్తర, ఈశాన్య దిశలో ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరికైనా బాల్కనీలో లేదా కిటికీ దగ్గర పెంచాలని అనుకుంటే పై పేర్కొన్న దిశల్లో ఉంచడం మంచిది.

దక్షిణ దిశలో ఉంచకూడదు

దక్షిణ దిశను యమధర్ముని దిశగా భావిస్తారు. ఈ దిశలో తులసి మొక్కను ఉంచితే ఇంట్లో అసౌభాగ్యం చేకూరుతుందని నమ్మకం. అదేవిధంగా దీని వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని కూడా చెబుతారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశముందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

తులసి మొక్క వల్ల ప్రయోజనాలు

  • తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, ఐశ్వర్యం, శాంతి నెలకొంటాయి.
  • తులసి ఉంచిన ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చెత్త లేదా దుమ్ము చేరకుండా చూసుకోవాలి.
  • తులసి మొక్కను నేలలో నాటడం శుభప్రదం కాదని భావిస్తారు. కాబట్టి కుండీలలో పెంచడం ఉత్తమం.
  • తులసి మొక్కకు దగ్గరగా ముల్ల మొక్కలు లేకుండా చూడాలి.
  • వంటగదికి వెలుపల తులసి మొక్క ఉంచితే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని అంటారు.
  • తులసి మొక్కకు తగినంత సూర్యకాంతి అందేలా చూడాలి.
  • తులసి మొక్కను హాని కలిగించకూడదు లేదా ఆకులు నీరసంగా మారకుండా చూసుకోవాలి.
  • తులసి మొక్కను సరైన విధంగా సంరక్షించకపోతే ఇంట్లో దురదృష్టం వచ్చే అవకాశం ఉంది.
  • తులసి మొక్కను శ్రద్ధగా సంరక్షిస్తే అది కుటుంబానికి శుభఫలితాలు, సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటు భక్తి భావాన్ని కూడా పెంచుతుంది.

Follow Us
ప్రధాని మోదీ పర్యటన వేళ ఒక్కసారిగా కలకలం..
ప్రధాని మోదీ పర్యటన వేళ ఒక్కసారిగా కలకలం..
టెన్త్‌ అర్హతతో SSBలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
టెన్త్‌ అర్హతతో SSBలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సైబరాబాద్‌ అభివృద్దికి వేలాది కోట్లు కేటాయింపు- ప్రధాని మోదీ
సైబరాబాద్‌ అభివృద్దికి వేలాది కోట్లు కేటాయింపు- ప్రధాని మోదీ
చిన్ననాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
చిన్ననాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
రమ్య కృష్ణ నేను దూరంగా ఉండడానికి కారణం అదే..
రమ్య కృష్ణ నేను దూరంగా ఉండడానికి కారణం అదే..
మగవారికి 40 ఏళ్లు దాటాయా? అయితే అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది
మగవారికి 40 ఏళ్లు దాటాయా? అయితే అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది
కాచిగూడ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్..
కాచిగూడ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్..
విజయ్ ఇన్ని తెలుగు సినిమాలు రీమేక్ చేశాడా! క్రేజ్ అంత ఇక్కడ నుండే
విజయ్ ఇన్ని తెలుగు సినిమాలు రీమేక్ చేశాడా! క్రేజ్ అంత ఇక్కడ నుండే
ఇంట్లో ఏం చేసిన కలసి రావడం లేదా ?? ఈ చిన్న మార్పులు చేయండి
ఇంట్లో ఏం చేసిన కలసి రావడం లేదా ?? ఈ చిన్న మార్పులు చేయండి
రాసిపెట్టుకోండి.. పెద్ది ఒక విజువల్ వండర్..
రాసిపెట్టుకోండి.. పెద్ది ఒక విజువల్ వండర్..