ఇంట్లో బల్లుల బెడదా..? ఈ టిప్స్‌తో తరిమికొట్టండి..
ఇంటి పరిసరాల్లో కనిపించే బల్లులు మనల్ని భయపెడుతుంటాయి. గోడ మీద బల్లి భయంతో చాలా మంది కంటిమీద కునుకు కూడా లేకుండా ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని సింపుల్ హోమ్ టిప్స్.. ఈ ట్రిక్స్ పాటించి ఈజీగా బల్లులను ఇంట్లో నుంచి తరిమేయవచ్చు.
ఇంట్లో బల్లలు ఉంటే యమ చిరాగ్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా అవి తిరుగుతుంటే అసహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా వంట గదుల్లో అవి తిరుగుతుంటే.. డోకు వస్తుంది. అది ఎప్పుడు జారి ఆ వంటలో పడిపోతుందే తెలీదు. అదే జరిగితే ఆ వంట అంతా విషంగా మారిపోతుంది. ఇక చాలామందికి బల్లులు అంటే భయం ఉంటుంది. బల్లుల వలన కలిగే భయాన్ని హెర్పెటోఫోబియా అంటారు. ఇంటి నుండి బల్లులను తరిమికొట్టడానికి ఇక్కడ సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
ఉల్లిపాయలు:
ఉల్లిపాయలు కేవలం వంట కోసమే కాదు. వాటితో వంట గది నుంచి బల్లులను కూడా తిప్పికొట్టవచ్చు. ఉల్లిపాయల నుంచి వెలువడే ఘాటైన వాసన బల్లులను తిప్పికొడుతుంది. ఉల్లిపాయను కట్ చేసి, బల్లి ఎక్కడ నుండి వస్తుందో అక్కడ ముక్కలు చేసి పెట్టండి. దాని నుండి వచ్చే వాసన బల్లిని ఇంట్లోకి రానివ్వదు. అలాగే, బల్లులను గోడ నుండి దూరంగా తరిమివేయడానికి, ఉల్లిపాయను ముక్కలుగా చేసి తీగతో కట్టి గోడకు వేలాడదీయండి.
వెల్లుల్లి:
బల్లులను ఇంట్లో ఉంచుకోవడానికి వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. వెల్లుల్లిని కోసి ఇంట్లో బల్లులు తిరిగే కిటికీ, తలుపులు వంటి ప్రదేశాల్లో ఉంచండి. వెల్లుల్లి బలమైన వాసన బల్లులను తరిమికొడుతుంది. అలా కాకుండా వెల్లుల్లిని మెత్తగా నూరి.. అందులో నీళ్లు కలిపి.. బల్లలు తిరిగే ప్రదేశంలో చల్లితే.. అవి ఆ ప్రాంతం వైపు రావు.
పెప్పర్ స్ప్రే:
పెప్పర్ స్ప్రే, చిల్లి స్ప్రే ఉపయోగించి ఇంట్లోకి బల్లులు రాకుండా చేయవచ్చు. స్ప్రే నుంచి వచ్చే బలమైన వాసన బల్లులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మార్కెట్ లో పెప్పర్ స్ప్రే కొనడం ఎందుకు అనుకుంటే.. ఇంట్లోనే పెప్పర్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా మిరియాలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్‌ను నీళ్లతో బాగా కలపండి. ఆపై స్ప్రే బాటిల్‌లో నింపండి. ఇప్పుడు బల్లులు ఉన్న ప్రదేశాల్లో స్ప్రే చేస్తే.. ఇకపై వాటితో ఇబ్బంది ఉండదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..